AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By Election: హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌దే గెలుపు.. సంచలన కామెంట్స్ చేసిన బండి సంజయ్..

Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నికలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.

Huzurabad By Election: హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌దే గెలుపు.. సంచలన కామెంట్స్ చేసిన బండి సంజయ్..
Bandi Sanjay
Shiva Prajapati
|

Updated on: Jul 24, 2021 | 2:12 PM

Share

Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నికలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. హుజూరాబాద్‌లో తమ పార్టీ నేత ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. 71 శాతం ఓట్లతో ఈటల రాజేందర్ గెలుస్తాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంటకి పదివేలు ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. శనివారం నాడు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చారా? అని ప్రశ్నించారు. దళిత బంధు పథకం కింద పది మందికి ఇచ్చి.. వేరే వాళ్లకు ఇవ్వకుండా కోర్టుకు పంపిస్తారని, ఆ నిందను ప్రతిపక్షాలపై వేస్తారని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవిని దళితులకు అప్పగిస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ పని చేశారా? అని ప్రశ్నించారు.

ఎరువులు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఆ హామీని ఏం చేశారని బండి సంజయ్ నిలదీశారు. భారతీయ జనతా పార్టీ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించబోతోందని బండి సంజయ్ ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కాషాయమయం చేయడానికి ప్రతీ బీజేపీ కార్యకర్త పని చేస్తున్నాడని సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయం అని తమ పార్టీ అధ్యక్షుడు నడ్డా తనకు చెప్పారని బండి సంజయ్ అన్నారు. ఇతర పార్టీల వాళ్లు ఇచ్చే పైసలు తీసుకుని.. నిజాయితీగా బీజేపీకి ఓటు వేయండని ప్రజలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ పేటెంట్ కేసీఆర్‌కు మాత్రమే కాదన్నారు. తెలంగాణ సాధించింది కేసీఆర్ కోసమో.. కేసీఆర్ కుటుంబం కోసమో కాదని వ్యాఖ్యానించారు. అధికారం చెలాయించే పార్టీకి అభ్యర్థి దొరకడం లేదని.. ఇక హుజూరాబాద్‌లో ఆ పార్టీకి గెలుపు ఎక్కడిది అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Also read:

V Hanumantha Rao: ఆ విషయాలపై ఇప్పుడేం మాట్లాడను.. క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత..

Viral Video: భార్యపై భర్త ప్రాంక్.. అమాంతం లేచి నిల్చున్న కురులు.. అది చూసి హడలిపోయిన భార్య.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: కరోనా వ్యాక్సీన్‌ కోసం క్యూలో నిల్చున్న మహిళలు.. అంతలో ఊహించని సీన్.. వైరల్ అవుతున్న వీడియో..