AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్థులకు అలెర్ట్‌.. ఆ జిల్లాలో విద్యా సంస్థలకు బుధవారం సెలవు.. ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం (మార్చి 1) జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.

Telangana: విద్యార్థులకు అలెర్ట్‌.. ఆ జిల్లాలో విద్యా సంస్థలకు బుధవారం సెలవు.. ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌
Students
Basha Shek
|

Updated on: Feb 28, 2023 | 10:35 PM

Share

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం (మార్చి 1) జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని కలెక్టర్‌ పమేలా సత్పతి ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకుంటున్నాయి. నారసింహుడుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మార్చి 3వ తేదీన యాదాద్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి నారసింహుని తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి ప్రభుత్వం తరపున పలువురు మంత్రులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా తిరుకల్యాణం నేపథ్యంలో బ్రహ్మోత్సవ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం దేదీప్యంగా అలరారుతూ దర్శనమిచ్చింది.

నారసింహుని తిరు కల్యాణ వైభవాన్ని కనులారా దర్శించేందుకుగానూ.. భక్తజన సందోహం భారీగా తరలివచ్చింది. ఆలయంలోని బ్రహ్మోత్సవ శోభను చూసి భక్తులు పులకించి పోయారు. యాదగిరీశుడి నవ్యప్రాంగణం శోభాయమానంగా దర్శనమిస్తోంది. ఇక  విద్యుత్ కాంతుల్లో యాదాద్రి ఆలయం దగదగ మెరిసిపోతుంది.  బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో నిర్వహించే నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, బాలభోగం, అభిషేకం, అర్చనలను నిలివేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.