Revanth Reddy: కోడిగుడ్లు, టమాటాలతో రేవంత్ రెడ్డిపై దాడి.. భూపాలపల్లి పాదయాత్రలో ఉద్రిక్తత

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలతో దాడికి పాల్పడ్డారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం ఆయన పాదయాత్ర భూపాలపల్లిలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయనపై దుండగులు కోడిగుడ్లు..

Revanth Reddy: కోడిగుడ్లు, టమాటాలతో రేవంత్ రెడ్డిపై దాడి.. భూపాలపల్లి పాదయాత్రలో ఉద్రిక్తత
Revanth Reddy
Follow us

| Edited By: Basha Shek

Updated on: Mar 01, 2023 | 4:19 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరుగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి మీటింగ్ పై చెప్పులు విసిరేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం ఆయన పాదయాత్ర భూపాలపల్లిలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయనపై దుండగులు కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. పోలీసులు అడ్డుకున్నా కోడిగుడ్లు విసిరారు. టమోటాలతో దాడి చేశారు. సభా వేదిక వద్దకు దూసుకొచ్చేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి.. ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు.

తనపై కోడిగుడ్లు వేయించడం కాదని, దమ్ముంటే ఇక్కడికి రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 100 మంది తాగుబోతులను తనపైకి పంపుతావా అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అనుచరుల పనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తలచుకుంటే నీ ఇల్లు కూడా వుండదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి కార్నర్ షో లో మాట్లాడుతుండగా దూసుకొచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి సినిమా థియేటర్లో వేసి పోలీసులు గేటుకు తాళాలు వేశారు.

స్పందించిన రేవంత్ రెడ్డి

భూపాలపల్లి పాదయాత్రలో తన పై BRS కార్యకర్తల దాడిపై తీవ్రంగా మండి పడ్డారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే BRS ఎమ్మెల్యే నేరుగా వచ్చి తనతో తేల్చుకోవాలని తాగుబోతులను తన మీదకి పంపడం కాదని రేవంత్ హెచ్చరించారు. ఎమ్మెల్యే నేరుగా అంబేద్కర్‌ సెంటర్‌ కి వస్తే ఉరికించి కొడతానని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం