Revanth Reddy అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన రేవంత్‌కు లోక్‌సభ సవాల్‌..! టీవీ9 ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ముందే చెప్పా, తెలంగాణలో మార్పు వస్తుందని కూడా ముందే చెప్పా. అదే జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Revanth Reddy అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన రేవంత్‌కు లోక్‌సభ సవాల్‌..! టీవీ9 ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు
Revanth Reddy In Tv9
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 09, 2024 | 11:12 PM

18వ లోక్‌సభ ఎన్నికలను కాంగ్రె, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒక వైపు 400 ప్లస్‌ టార్గెట్‌తో వెళ్తున్న బీజేపీ. ఇక్కడేమో 14+ టార్గెట్. గెలిస్తేనే.. కడుపులో చల్ల కదలకుండా పరిపాలన అనే పరిస్థితి. మరి.. సీఎం రేవంత్‌ వ్యూహాలేంటి? 14+పై ఇస్తున్న గ్యారెంటీ ఏంటి? వంటి పలు కీలక అంశాలపై టీవీ9కు ఇచ్చి ప్రత్యేక ఇంటర్వ్యూలో మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌ సంధించిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ముందే చెప్పా, తెలంగాణలో మార్పు వస్తుందని కూడా ముందే చెప్పా. అదే జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని బీజేపీ మార్చబోతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు దక్కుతున్న రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.

బీజేపీ కుట్రలే ఎన్నికల్లో ప్రధాన అజెండా అన్న రేవంత్ రెడ్డి, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పాత్ర లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అన్నారు సీఎం. డిసెంబర్‌లో సెమీఫైనల్స్‌ జరిగాయి. మే 13న ఫైనల్స్ జరగబోతున్నాయన్నారు రేవంత్. జెండా మారింది ఎజెండా మారింది.. ఎన్నికల పంథా మారిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ సారి ఎన్నికలతో బీజేపీ కథ ముగిసిందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి