AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ అదేనా..

బీఆర్ఎస్ వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఒకవైపు కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వరుసగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చాలా సందర్భాల్లో ప్రతిఘటిస్తున్నారు.. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను బలహీనపరుస్తూ పలువురు బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వరుసగా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు..

Revanth Reddy: పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ అదేనా..
Revanth Reddy
Ashok Bheemanapalli
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Feb 06, 2024 | 9:51 PM

Share

బీఆర్ఎస్ వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఒకవైపు కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వరుసగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చాలా సందర్భాల్లో ప్రతిఘటిస్తున్నారు.. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను బలహీనపరుస్తూ పలువురు బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వరుసగా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు.. కొద్దిరోజుల క్రితమే పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ విషయంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆన్ రికార్డులో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కలిశాం.. అంటూ ఏదో కవరింగ్ ఇచ్చుకున్నా అసలు విషయం మాత్రం వేరే ఉన్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తునాయి.. ఇక పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత మరో అడుగు ముందుకు వేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి బిఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చారు.

నిన్నటి వరకు పలువురు కలిసినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేరుతారు అంటూ గుసగుసలు వినిపించాయి. పెద్దపల్లి ఎంపీ ఏకంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. గతంలో పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారి చేరికపై ఇంకా ఇప్పటికి స్పష్టత లేదు. ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలలో ఆత్మస్థైర్యం నింపేందుకు వరుసగా సదస్సులు నిర్వహిస్తూనే ఉంది. కొంతమంది కీలక నేతలు బహిరంగంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూడు నెలల్లో కూలుస్తామని విమర్శలు చేస్తున్నారు.. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు బిఆర్ఎస్ నాయకులు సీక్రెట్ గా సన్నాహాలు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని వెనుక.. పార్లమెంట్ ఎన్నికల తరువాత ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది..

రేవంత్ రెడ్డి సీక్రెట్‌గా ఈ ఆపరేషన్ కొనసాస్తున్నట్టుగా తెలుస్తోంది. సభల్లో సమావేశాల్లో ఘాటుగా విమర్శిస్తూనే మరోవైపు యాక్షన్ ప్లాన్ షురూ చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన పరిస్థితిని ఇప్పుడు బిఆర్ఎస్ కి కూడా చేయాలని.. ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొందరిని సీక్రెట్ గా మరి కొందరిని బహిరంగంగానే కలుస్తూ పార్టీకి బలాన్ని చేకూరుస్తున్నారు.

ఏది ఏమైనా తెలంగాణలో చేరికల ప్రక్రియ మొదలైంది.. పార్లమెంట్ ఎన్నికలకు ముందే బిఆర్ఎస్ కు మరో గట్టి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత బాటలోనే మరికొందరు ఉన్నట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇలాంటి షాక్ తగలటంతో మిగిలిన నేతలు సైతం లైన్ క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..