Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు..
హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనియా 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 78 కిలోల కేక్‌ను కాంగ్రెస్ నేతలు కట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలకు తినిపించారు.
హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనియా 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 78 కిలోల కేక్‌ను కాంగ్రెస్ నేతలు కట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నేత వీహెచ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీ కేక్ కట్ చేసే హక్కు, అర్హత విహెచ్ కే ఉందంటూ ఆయనతో కేక్ కట్ చేయించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా జన్మదినం రోజునే తెలంగాణ ప్రకటన వచ్చిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన నిజమైన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నారు. కార్యకర్తల త్యాగం, కష్టంతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టింది..ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొన్నా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో సోనియా గాంధీ వచ్చినప్పుడు తెలంగాణ తల్లిని చూసారు.. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు నేనున్న అంటూ భరోసా ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలోకి సోనియా గాంధీ ప్రవేశించినప్పుడు ప్రజలు నిల్చొని అభినదించినప్పుడు ఆమె ముఖంలో సంతోషం కలిగిందన్నారు. మళ్లీ అలాంటి రోజు చూడలేం..పీసీసీ అధ్యక్షుడి గా తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. 2017 డిసెంబర్ 9న మొదటిసారి గాంధీభవన్ లో కాలు పెట్టాను.. ఇప్పుడు డిసెంబర్ 9 ముఖ్యమంత్రిగా వచ్చానన్నారు. 10 సంవత్సరాల్లో కార్యకర్తలు వేల కేసులు మోస్తున్నారు.. కార్యకర్తలకు మాట ఇస్తున్న ఈ ప్రభుత్వం మీది.. పేదలది.. ఇందిరమ్మ ఆశయాలను నెరవేరుస్తామంటూ హామీనిచ్చారు. మొదటిసారి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం.. అందరూ ఆశీర్వదించాలంటూ రేవంత్ రెడ్డి కోరారు.
తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని.. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చారిత్రాత్మకమైన రోజు..సోనియా గాంధీ జన్మదినం, తెలంగాణ ప్రకటన చేసిన రోజు.. తెలంగాణ వచ్చిన తరువాత కూడా దశాబ్ద కాలం ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. మార్పు కోసం రాష్ట్ర ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని.. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సిద్ధాంతాలను వివరిస్తున్నాం.. ప్రతి హామీ అమలు చేస్తామని, రాష్ట్ర సంపద ,వనరులను ప్రజలకు పంచడానికే ప్రజా ప్రభుత్వ ఏర్పడిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..