BRSLP Leader: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిక ఏకగ్రీవం
కొత్తగా ఎన్నికైన బీఆర్‌ఎస్ శాసనసభ్యులు తమ పక్షనేతగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. శాసససభాపక్షానికి సంబంధించి మిగిలిన సభ్యుల ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ బీఆర్‌ఎస్‌ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
కొత్తగా ఎన్నికైన బీఆర్‌ఎస్ శాసనసభ్యులు తమ పక్షనేతగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకుని బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో నిలిచింది. ఈ నేపథ్యంలో సమావేశమైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ మేరకు తీర్మానం చేశారు.
శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ పేరును బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా తలసాని శ్రీనివాస్‌యాదవ్, కడియం శ్రీహరి దాన్ని బలపరిచారు. శాసససభాపక్షానికి సంబంధించి మిగిలిన సభ్యుల ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ బీఆర్‌ఎస్‌ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు శస్త్రచికిత్స జరిగిన కారణంగా శనివారం నాటి బీఆర్ఎస్‌ఎల్‌పీ సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…