BJPLP: బీజేపీ శాసనసభపక్ష సమావేశం కీలక నిర్ణయం.. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకుండానే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. తొలిరోజు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలంతా శనివారం ఉదయం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో సమావేశమయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకుండానే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. తొలిరోజు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలంతా శనివారం ఉదయం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో సమావేశమయ్యారు. కొత్తగా ఎన్నికైన 8 మంది పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు కిషన్ రెడ్డి. అనంతరం అందరూ కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ శాసనసభ తొలి సమావేశాలు ఈరోజు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సభలో చర్చించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు సూచించారు కిషన్ రెడ్డి. అనంతరం కిషన్ రెడ్డి కొత్త ఎమ్మెల్యేలందరితో కలిసి చార్మినార్ దగ్గర అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు శాసనాసభాపక్షనేతను ఎన్నుకోనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు. ఫ్లోర్ లీడర్ రేసులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. అయితే కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిపై గెలిచిన వెంకటరమణారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.
మరోవైపు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉండటంతో తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశానికి రావడం లేదని వీడియో రిలీజ్ చేశారు. దేశాన్ని తిట్టే వారిని ప్రొటెం స్పీకర్ గా ఎలా చేస్తారని ప్రశ్నించారు రాజాసింగ్. ఈ నేపథ్యంలోనే మిగిలిన ఎమ్మెల్యేలు సైతం తొలిరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ గత సంప్రదాయాలను, నియమాలను తుంగలో తొక్కిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎంతో ఒప్పందంలో భాగంగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…