AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం.. ఈ క్యాంపస్ ప్రత్యేక ఏంటో తెలుసా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆరుట్లలో నిర్మించిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ రిబ్బన్ కట్‌ చేసి స్టార్ట్ చేశారు సీఎం రేవంత్. అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి బ్రేక్‌ ఫాస్ట్ చేశారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్యను అందించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొచ్చింది.

Telangana: ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం.. ఈ క్యాంపస్ ప్రత్యేక ఏంటో తెలుసా?
Telangana Public School Arutla
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 10:39 AM

Share

తెలంగాణలో విద్యా విప్లవానికి ఆరుట్ల నుంచి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఇబ్రహీంపట్నంలోని ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడే విద్యార్థులతో పాటు బ్రేక్‌ఫాస్ట్ చేసిన సీఎం వారితో కాసేపు ముచ్చటించారు. తర్వాత స్కూల్లో ఉన్న డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూట్ ప్రత్యేకతలేంటి?

ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం ఉచిత విద్య మాత్రమే కాదు.. నాణ్యత, సౌకర్యాలు, భవిష్యత్ అవకాశాల్లోనూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకూడదనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం కొత్త విద్యా నమూనాను ఆవిష్కరించింది. ఇది కేవలం ఒక పాఠశాల ప్రారంభం కాదు.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించే లక్ష్యంతో ఈ మోడల్‌ను రూపొందించారు.

నాలుగు పాఠశాలలతో ప్రారంభమైన ప్రయోగం

పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్ర‌జా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆరుట్ల క్యాంపస్‌లో 1,814 స్టూడెంట్స్

ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్‌లో 600 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు.

ఆరుట్ల టీపీఎస్‌లో ఏముంది?

చిన్నారుల తొలి అడుగు నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు ఒకే ప్రాంగణంలో ఇంగ్లీష్ మీడియం విద్య అందించే విధంగా వ్యవస్థను రూపొందించారు. విద్యార్థుల అభ్యాస ప్రయాణం మధ్యలో అంతరాయం లేకుండా చూసే ప్రయత్నం ఇది. పుస్తకాలతో పాటు పోషకాహారం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం పోషకాహార స్నాక్స్‌ను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిగణించే విధానం ఇది.

ఇంటి నుంచి స్కూల్ వరకు భద్రమైన ప్రయాణం

పరిసర గ్రామాల విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఐదు బస్సులు రోజువారీ రవాణా సేవలు అందించనున్నాయి.

స్మార్ట్ క్లాస్‌రూమ్స్ – ఆధునిక ల్యాబ్స్

డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఆధునిక సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్, సమృద్ధిగా పుస్తకాలతో కూడిన లైబ్రరీ, విశాలమైన తరగతి గదులు విద్యార్థుల అభ్యాసానికి అనుకూలంగా రూపొందించారు.

చదువు మాత్రమే కాదు.. క్రీడలకూ ప్రాధాన్యం

క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి క్రీడలకు ప్రత్యేక మైదానాలు, కోర్టులు ఏర్పాటు చేశారు. శిక్షణ కోసం ప్రత్యేక కోచ్‌లను కూడా నియమించారు.

ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ

ఈ పాఠశాలల నిర్వహణను జిల్లా అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగించనున్నారు. వివిధ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణలో పాల్గొంటూ విద్యార్థుల భద్రత, సౌకర్యాలు, విద్యా ప్రమాణాలను పరిశీలిస్తారు.

ప్రభుత్వ విద్యకు కొత్త నిర్వచనం

ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే కాకుండా.. ప్రభుత్వ విద్యను ఒక ప్రత్యామ్నాయంగా కాకుండా మొదటి ఎంపికగా మార్చాలన్న లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆరుట్లలో ప్రారంభమవుతున్న ఈ ప్రయోగం విజయవంతమైతే.. రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యా రంగంలో ఇది ఒక కొత్త ప్రమాణంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల దృక్పథాన్ని మార్చగల శక్తి ఈ మోడల్‌లో ఉందా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం
ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం
ఆ సినిమా చూడలేక ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా..
ఆ సినిమా చూడలేక ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా..
5 వరల్డ్ కప్‌లలో గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా మెస్సీ రికార్డు
5 వరల్డ్ కప్‌లలో గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా మెస్సీ రికార్డు
మాయమవుతున్న జానపద ఆచారం! కందికట్కూరులో కప్పతల్లి ఆట ఆడిన పిల్లలు
మాయమవుతున్న జానపద ఆచారం! కందికట్కూరులో కప్పతల్లి ఆట ఆడిన పిల్లలు
పీపీఎఫ్ ఖాతా ద్వారా ప్రతీ నెలా రూ.లక్ష పెన్షన్.. ఎలా అంటే..?
పీపీఎఫ్ ఖాతా ద్వారా ప్రతీ నెలా రూ.లక్ష పెన్షన్.. ఎలా అంటే..?
నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది?
నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది?
హైదరాబాద్-బెంగళూరు.. బుల్లెట్ ట్రైన్ వెళ్లేది ఈ రూట్‌లోనే
హైదరాబాద్-బెంగళూరు.. బుల్లెట్ ట్రైన్ వెళ్లేది ఈ రూట్‌లోనే
12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..?
12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..?
వైభవ్ సూర్యవంశీ గొడవపై ఎట్టకేలకు నోరు విప్పిన బీసీసీఐ
వైభవ్ సూర్యవంశీ గొడవపై ఎట్టకేలకు నోరు విప్పిన బీసీసీఐ
హారర్ సినిమా ప్రియులా.. ? అయితే ఈ చిత్రాలు అస్సలు మిస్సవకండి..
హారర్ సినిమా ప్రియులా.. ? అయితే ఈ చిత్రాలు అస్సలు మిస్సవకండి..