AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF: పీపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.లక్ష మీ సొంతం.. డబ్బులకు ఢోకా ఉండదు..

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. ఎవరిని అడిగినా ఈ స్కీమ్ గురించి చెబుతారు. ఎందుకంటే ప్రతీఒక్కరికీ ఈ స్కీమ్ గురించి తెలిసే ఉంటుది. కోట్ల మంది ఈ పొదుపు పథకంలో తమ డబ్బులను దాచుకుంటున్నారు.

PPF: పీపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.లక్ష మీ సొంతం.. డబ్బులకు ఢోకా ఉండదు..
Ppf
Venkatrao Lella
|

Updated on: Jun 17, 2026 | 10:06 AM

Share

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సేవింగ్స్ స్కీమ్స్. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో ఆదాయ పొందాలనుకునేవారికి ఇది మంచి పథకం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకం కావడంతో మీ పెట్టుబడులు సురక్షితంగా, భద్రంగా ఉంటాయి. మీ డబ్బులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి హామీ కూడా అందిస్తుంది. స్టాక్ మార్కెట్ ఒడిదొడులతో సంబంధం లేకుండా వంద శాతం రిస్క్ లేని పెట్టుబడి పథకం ఇది. అంతేకాకుండా మీ పెట్టుబడులు, రాబడి మొత్తం ట్యాక్స్ ఫ్రీ. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీతో పాటు మెచ్యూరిటీ సమయంలో చేతికి అందే మొత్తం డబ్బుపై కూడా ఎలాంటి పన్ను అనేది ఉండదు. పన్ను ప్రయోజనాలు పొందాలనుకునేవారికి ఇది బెస్ట్ స్కీమ్‌గా మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి.

పన్ను ఆదా ఎలా చేసుకోవచ్చంటే..?

అయితే పీపీఎఫ్ ద్వారా పన్ను ఆదా చేసుకోవడమే కాకుండా రిటైర్మెంట్ వయస్సు తర్వాత ప్రతి నెలా భారీ పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షలు చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. సగటున 7.10 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం లెక్కిస్తే 30 ఏళ్ల తర్వాత రూ. 1,54,50,911 అవుతాయన్నమాట. ఈ భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోకుండా.. దానిని తెలివిగా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ కింద మార్చుకోవాలి. ఈ మొత్తాన్ని ఏటా 7 శాతం వరకు స్థిరమైన రాబడిని ఇచ్చే సురక్షితమైన సాధనంలో ఉంచి ప్రతి నెలా రూ. లక్ష చొప్పున పెన్షన్ తరహాలో విత్‌డ్రా చేసుకోవాలి. ఇలా చేస్తే రాబోయే 20 సంవత్సరాల పాటు మీకు పెన్షన్ అందుతుంది. ఇలా 20 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 2.40 కోట్లు విత్‌డ్రా చేసుకున్న తర్వాత కూడా ఇంకా రూ. 1.5 కోట్లకుపైగా మీ అకౌంట్లో ఉంటాయి. వృద్ధాప్యంలో స్థిరమైన పెన్షన్, భారీ సంపదను మిగుల్చుకోవాలనుకునేవారికి ఈ ఐడియా అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నేళ్లు పొడిగించుకోవచ్చు..?

కాగా సాధారణంగా పీపీఎఫ్ ఖాతా గడువు 15 ఏళ్లు మాత్రమే. మీరు ఆ తర్వాత ఐదేళ్ల చొప్పున ఎన్నిసార్లైనా పొడిగించుకునే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. ఒక వ్యక్తి 30 ఏళ్ల వయస్సులో పీపీఎఫ్ ఖాతాను తెరిస్తే.. దానిని మూడు సార్లు ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటే.. మొత్తం 30 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించవచ్చు.

Follow Us