AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. 2026 చివరి నాటికి మరో రికార్డ్..! ఎంతవరకంటే..?

బంగారం ధరలపై జేపీ మోర్గాన్ సంచలన అంచనా వేసింది. 2026 చివరి నాటికి రికార్డ్ స్థాయికి చేరుకునే అవకాశముందని స్పష్టం చేసింది. 2027 నాటికి మరింత పెరుగుతాయని తెలిపింది. బంగారానికి భవిష్యత్ డిమాండ్ కొనసాగుతుందని తెలిపింది. ఈ సంస్థ అంచనాలు ఎలా ఉన్నాయంటే..

Gold Rates: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. 2026 చివరి నాటికి మరో రికార్డ్..! ఎంతవరకంటే..?
Gold
Venkatrao Lella
|

Updated on: Jun 17, 2026 | 9:39 AM

Share

బంగారం ధరలు ప్రస్తుతం పడిపోతున్నాయి. ఇటీవల తులం బంగారం రూ.1.45 లక్షలకు పడిపోగా.. ప్రస్తుతం రూ.1.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఇదే తగ్గుదల కొనసాగుతుందా..? లేదా పెరుగుతుందా? అనే చర్చ నడుస్తోంది. బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు ధరలు ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. ధర తగ్గినప్పుడు కొనుగోలు చేస్తామని కొంతమంది రోజువారీ ధరలపై ఒక కన్నేసి ఉంచుతారు. ఇక మరికొంతమంది ఆసక్తితో పరిశీలిస్తారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం ముగియడంతో గోల్డ్ రేట్లు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది.

జేపీ మోర్గాన్ అంచనాలు

ఈ క్రమంలో బంగారం ధరలపై ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ జేపీ మోర్గాన్ అంచనాలు వెలువడ్డాయి. బంగారం ధరలు 2026 చివరి నాటికి ఔన్సుకు 6 వేల డాలర్లకు చేరుకుంటాయని తెలిపింది. ఇక 2027 నాటికి 6,300 డాలర్లకు చేరవచ్చని స్పష్టం చేసింది. ఇటీవలి ధరలు తగ్గినప్పటికీ.. ద్రవ్యోల్బణ ఆందోళనలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సురక్షిత ఆస్తిగా బంగారాన్ని పెట్టుబడిదారులు భావిస్తుండటం వల్ల ధరలు పెరుగుతాయని తెలిపింది. 2026 చివరి నాటికి బంగారం ధరలు కొత్త రికార్డు సృష్టిస్తాయని, నాలుగో త్రైమాసికంలో ఔన్సుకు 6000 డాలర్లకు పెరగవచ్చని, 2027 కల్లా 6300కి చేరుకునే అవకాశముందని అంచనా వేసింది. 2026, 2027 సంవత్సరాలకు బంగారం ధరల అంచనాలు ప్రస్తుత స్థాయిల కంటే ఎక్కువగానే ఉన్నాయని జేపీ మోర్గాన్ పేర్కొంది.

పుంజుకున్న బంగారం ధరలు

బంగారం ధరలు 2026 ప్రారంభంలో పుంజుకున్నాయి. మార్చిలో శాంతించి ఇటీవలే సంవత్సరపు కనిష్ట స్థాయికి దిగజారాయి. అయితే భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్య విధానంపై అనిశ్చితి వంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తూనే ఉంటాయని జేపీ మోర్గాన్ తన అంచనాల్లో వెలువరించింది. బంగారం భవిష్యత్ డిమాండ్, ధరల స్థిరత్వం అనేవి భౌగోళిక రాజకీయ సంఘర్షణల పరిష్కారం, ఫెడ్ వడ్డీ రేట్ల విధానంపైనా ఆధారపడి ఉంటుందని తెలిపింది. అయితే గత కొన్నేళ్లుగా బంగారం ధరలు పెరగడానికి కారణమైన అంశాలు చాలా వరకు చెక్కుచెదరకుండా ఉన్నాయని నివేదిక పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం, కొనుగోలు శక్తి క్షీణత, అమెరికా ఆర్థిక ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ విభజన, విధాన అనిశ్చితి వంటి ఆందోళనలు సురక్షిత ఆస్తిగా బంగారానికి ఉన్న డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయని జేపీ మోర్గాన్ పేర్కొంది.

Follow Us