AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG20: మామూలుగా ఉండదు మరి.. TG20కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ..

విజయ్ దేవరకొండను TG20 Leagueకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. Hyderabad Cricket Association ఆధ్వర్యంలో జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఫైనల్ జూలై 12న రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనుంది. విజేత జట్టుకు రూ.1 కోటి, రన్నరప్‌కు రూ.50 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. టీజీ20 ట్రోఫీని హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఘనంగా ఆవిష్కరించనున్నారు.

TG20: మామూలుగా ఉండదు మరి.. TG20కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ..
Tg 20
Shaik Madar Saheb
|

Updated on: Jun 17, 2026 | 9:10 AM

Share

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ20 లీగ్’ ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి విజయ్‌ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.. తెలంగాణలో క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే విజన్‌లో దిగ్గజ సూపర్‌స్టార్ మాతో చేరినందుకు సంతోషిస్తున్నామమని.. ‘టీజీ20 లీగ్’ నిర్వాహకులు వెల్లడించారు. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహారిస్తున్న ఈ లీగ్‌లో ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టు మిగతా అన్ని టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ తలపడతాయి.లీగ్‌లో మొత్తం 38 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. జూలై 12న ఉప్పల్ స్టేడియం వేదికగా ఫైనల్ ఫైట్ జరుగుతుంది. అయితే.. లీగ్ ప్రారంభానికి ముందు.. టీజీ20 (TG20) లీగ్ ట్రోఫీని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ దగ్గర బుధవారం ఆవిష్కరించనున్నారు.

విజేతకు రూ.కోటి..రన్నరప్‌కు రూ.50 లక్షలు

లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు జులై 9న ఎలిమినేటర్ మ్యాచ్‌ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. జులై 9న రాత్రి జరిగే క్వాలిఫయర్‌-1లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఢీకొంటాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టు జులై 10న రెండో క్వాలిఫయర్‌లో ఎలిమినేటర్ విజేతతో తలపడనుంది. దీంట్లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. జులై 12న టైటిల్ పోరు ఉంటుంది. టీజీ20 లీగ్‌లో విజేతగా నిలిచే జట్టుకు కోటి రూపాయలు, రన్నరప్‌కు 50 లక్షల ప్రైజ్ మనీ అందుతుంది. టోర్నమెంట్‌లో విజేతకు అందించే విన్నర్స్ ట్రోఫీని ఇవాళ ట్యాంక్‌బండ్‌పై ఆవిష్కరిస్తారు. ఈ వేడుకకు హెచ్‌సీఏ ప్రతినిధులతో పాటు క్రీడా, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

అటు ఏపీలో ఇప్పటికే ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-5 ప్రారంభమైంది. ఈ నెల 9న ప్రారంభమైన ఏపీఎల్‌ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. నేటినుంచి ఈ నెల 21 వరకూ కడపలో తొలిసారి ఏపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
TG20కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ..
TG20కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ..
ఈ రోజుల్లో నమ్మకమే అసలైన ఆస్తి- జీ7 సదస్సులో ప్రధాని మోదీ
ఈ రోజుల్లో నమ్మకమే అసలైన ఆస్తి- జీ7 సదస్సులో ప్రధాని మోదీ
అదే జరిగిగే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్
అదే జరిగిగే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్
చంద్రవంక పక్కనే శుక్రుడు.. నేటి సాయంత్రం ఆకాశంలో కనిపించనున్న..
చంద్రవంక పక్కనే శుక్రుడు.. నేటి సాయంత్రం ఆకాశంలో కనిపించనున్న..
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!