AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికెళ్లిన 18 మంది చిన్నారులు.. కాసేపటికే ఇది పరిస్థితి!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిన్న సుమారు 18 మంది చిన్నారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పానీపూరి తిన్నాక చిన్నారులకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అవ్వడంతో హాస్పిటల్‌లో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం వీరంతా హాస్పిట్‌లో చికిత్స పొందుతున్నారు.

Telangana: ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికెళ్లిన 18 మంది చిన్నారులు..  కాసేపటికే ఇది పరిస్థితి!
Pani Puri Food Poisoning
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 8:23 AM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిని 18 మంది చిన్నారులు అస్వస్థతకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న పానీపూరి బండివద్ద మంగళవారం సాయంత్రం కొందరు చిన్నారు పానీపూరి తిన్నారు. ఇది తిన్న కాసేపటికే కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా.. మరి కొందరు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అస్వస్థతకు గురైన చిన్నారుల్లో రిషికేష్ అనే బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తూ మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మిగతా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనతో కేసీఆర్ నగర్ కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. పానీపూరి తినడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. అనే దానిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారులందరికీ ఒకే తరహా లక్షణాలు కనిపించడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది పరిస్థితిని పరిశీలిస్తున్నారు. చిన్నారుల అనారోగ్యానికి గల అసలు కారణాలను నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపే అవకాశముంది.

చిన్నారులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న దృశ్యాలు ఇదిగో

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే