AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు తెలుగు రాష్ట్రాల్లో SIR కలకలం. అనుమానాలేంటి.. నిబంధనలు ఏంటి

దేశమంతటా బెంగాల్ ఫోబియా..! బెంగాల్‌లో ప్రభుత్వం మారి, ఓడిపోయిన దీదీ పార్టీకి చినిగి చాటౌతున్నందుక్కాదు. బెంగాల్‌లో గెలుపోటముల్ని నిర్ణయించిందని ప్రచారం జరుగుతున్న ఆ సర్‌ ప్రకియ చుట్టూనే దేశ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అపోజిషన్ పార్టీలన్నీ ఎటెన్షన్‌ మోడ్‌లో కొచ్చేశాయి. ఎందుకంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR తర్వాత బెంగాల్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి 91 లక్షలకు పైగా ఓట్లు డిలీటయ్యాయి. మొత్తం ఓట్లలో ఇదా దాదాపు 12 శాతం. ఒక్క ఓటుతోనే నేతల జాతకాలు తలకిందులౌతాయి. మరి 12 శాతం ఓట్లు గల్లంతైతే, అలా గల్లంతైన ఓట్లలో మనోళ్ల ఓట్లు ఉంటే.. ఊహించుకుంటేనే వణికిపోతోంది అన్ని పార్టీలకు. ఇప్పటికే ఆంధ్రాలో మొదలైపోయింది ఓట్ల వడపోత. తెలంగాణాలో ఈనెల 25 నుంచి సర్‌ ప్రక్రియ అమలవబోతోంది. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్లు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో SIR కలకలం. అనుమానాలేంటి.. నిబంధనలు ఏంటి
SIR in AP and Telangana
Ram Naramaneni
|

Updated on: Jun 16, 2026 | 9:35 PM

Share

సమయానికి ఇంట్లో ఉండకపోతే ఓటు గల్లంతేనా? ఓటరు కొత్త ప్రాంతానికి మారితే ఏమవుతుంది? అధికారులపై ప్రభుత్వాల పెత్తనం సాధ్యమేనా? అపోజిషన్ పార్టీలకు ఓటుగండం… నిజమేనా? అధికారపార్టీలు కూడా ఎందుకు ఉలిక్కిపడుతున్నట్టు? హైదరాబాద్‌లో సెటిలైన ఆంధ్రా ఓటర్ల గతేంటి? తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు తగ్గుతాయా, పెరుగుతాయాసర్‌ పూర్తయ్యేదాకా తప్పదా పొలిటికల్ తకరారు? మిలియన్ డాలర్ల క్వశ్చన్లతో మోత మోగిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ. అనుమానం పెనుభూతాలౌతున్నాయి. సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ రెండువారాల కిందటే స్పెషల్ ఎక్సర్‌సైజ్ చేశాయి. పార్టీ క్యాడర్‌ని సమాయత్తం చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన వర్క్‌షాప్‌లో ఐతే కూటమి పార్టీల మధ్య విభేదాలు కూడా చర్చకొచ్చాయి. మిత్రధర్మాన్ని ప్రతి నేతా, ప్రతి కార్యకర్తా పాటించాల్సిందేనని హెచ్చరించారు. ఒక పార్టీకి చెందిన ఓట్ల మీద మరో పార్టీ కన్నేస్తాయని చెప్పకనే చెప్పారు. SIR ప్రక్రియను అందరూ సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఉన్న ఓట్లను కాపాడుకోవడమే కాదు, కొత్త ఓట్ల చేరికను కూడా ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. చూస్తుండగానే జూన్ 15 రానే వచ్చింది. ఏపీలో ఇంటింటి సర్వే షురూ ఐంది. బూత్‌ లెవల్ ఆఫీసర్లు ఓటర్ల వివరాలు సేకరించి, ఎన్యుమరేషన్ ఫామ్స్ అందిస్తున్నారు. ఓటర్లు తమ వివరాలు పూర్తి చేసి, సిబ్బందికి ఇస్తున్నారు. జూలై 14 దాకా జరిగే ఫస్ట్ ఫేస్ ఇది. తర్వాత జూలై 21న ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆగస్టు 20 దాకా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!