AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: మెదక్ గడ్డపై BRS ఎన్నికల సమర శంఖారావం.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ..

CM KCR Medak Tour: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావు.. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల సమర శంఖారావం పూరించారు.. అభ్యర్థుల ప్రకటనతో ముందడుగు వేసిన గులాబీ పార్టీ అధినేత.. ఇవాళ మెదక్ వేదికగా జరగనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

CM KCR: మెదక్ గడ్డపై BRS ఎన్నికల సమర శంఖారావం.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ..
CM KCR
Shaik Madar Saheb
|

Updated on: Aug 23, 2023 | 7:27 AM

Share

CM KCR Medak Tour: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావు.. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల సమర శంఖారావం పూరించారు.. అభ్యర్థుల ప్రకటనతో ముందడుగు వేసిన గులాబీ పార్టీ అధినేత.. ఇవాళ మెదక్ వేదికగా జరగనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్‌ టూర్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన తర్వాత ఫస్ట్‌ పర్యటన ఇదే కావడంతో.. మంత్రి హరీష్‌రావు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించడమే కాకుండా.. ప్రతిపక్షాలకు కేసీఆర్‌ తనదైన శైలిలో పొలిటికల్‌ కౌంటర్లు కూడా ఇస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మెదక్ పర్యటన ఇలా.. సీఎం కేసీఆర్‌ ఈ ఉదయం 11 గంటలకల్లా మెదక్ చేరుకోనున్నారు. కలెక్టర్‌ కార్యాలయం.. పోలీసు కార్యాలయంతో పాటు.. బీఆర్ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ నుంచి నర్సాపూర్‌ మీదుగా రోడ్డు మార్గంలో సీఎం మెదక్‌కు చేరుకోనున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారి ముఖ్య మంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్‌.. వికలాంగులు ఆసరా పెన్షన్ పెంపుతో పాటు , ఇతరులకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు.

ప్రగతి శంఖారావంతో పాటు.. ఎన్నికల శంఖారావం..

మెదక్‌ నుంచి సీఎం కేసీఆర్‌ ప్రగతి శంఖారావంతో పాటు.. ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరిస్తారని బీఆరఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10కి పది స్థానాలు గెలిచి, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు హరీష్‌రావు. అభ్యర్థుల ప్రకటన తమ గెలుపునకు, ధీమాకు నిదర్శనమని.. కేసీఆర్‌ వ్యూహం ఎవరూ ఊహించలేదని, విపక్షాలు ఆగమైపోయాయని హరీష్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల తర్వాత.. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో..కేసీఆర్‌ విపక్షాలకు పంచ్‌ డైలాగులతో కౌంటర్లు ఇవ్వనున్నట్లు టాక్‌ నడుస్తోంది..సూర్యాపేట నుంచే కాంగ్రెస్‌, బీజేపీలను అటాక్‌ చేసిన కేసీఆర్‌.. మెదక్‌ సభనుంచి మరోసారి టార్గెట్ చేస్తారని చెప్పుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఏదేమైనా.. మైనంపల్లి హన్మంతరావు వివాదం నేపథ్యంలో.. కేసీఆర్‌ మెదక్‌ పర్యటనలో పాల్గొనడం చూస్తుంటే..ఆయన రాజకీయ వ్యూహం ముందు ప్రత్యర్థులు డీలా పడాల్సిందేనని గులాబీ సేన చెవులు కొరుక్కుంటోంది.. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడుతారనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ సైతం అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే.. కాంగ్రెస్ పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. బీజేపీ కూడా ఫైనల్ డ్రాఫ్ట్ కోసం రెడీ అవుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..