AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఇటీవల వరసగా..

హైదరాబాద్‌ పరిధిలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పటికీ కొంతమంది మృగాళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. నేడు అనేక రూపాల్లో మహిళల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మహిళలను రక్షించే బాధ్యత కేవలం పోలీసులు, ప్రభుత్వాలదే కాదు.. పౌర సమాజానిది కూడా. కుటుంబం నుంచి విద్యా సంస్థల వరకు స్త్రీలను గౌరవించే సంస్కృతిని పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

Hyderabad: నగరంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఇటీవల వరసగా..
Woman (Representative image)
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Aug 23, 2023 | 8:23 AM

Share

హైదరాబాద్ మహా నగరంలో వరుస ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. నెల వ్యవధిలోనే మహిళలు, బాలికలపై పలు దాడులు, హత్య, అత్యాచారాలు ఘటనలు నమోదవ్వడం ఆందోళన రేకెత్తుస్తుంది. ఇటీవల హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెవిటి, మూగ మహిళపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూసి బాధితీరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. విజయనగర్ కాలనీలో నివాసం ఉండే బాధిత మహిళను అదే ప్రాంతంలో ఉండే సాయి అనే వ్యక్తి బాత్రూంలో బంధించి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ మూగది కావడంతో రక్షించమని అరవడానికి కూడా కుదరలేదు. అనంతరం బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇక స్వాతంత్ర దినోత్సవం నాడు పోలీసులే గిరిజన మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనను మహిళ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏకంగా రాష్ట్ర గవర్నర్ సైతం ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసి.. ఇన్సిడెంట్‌పై పూర్తి వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.   ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసిన అధికారులు.. మరొక ఎస్సైపై బదిలీ వేటు వేశారు. ఇక యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసినటువంటి ఘటన జవహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను నిలువరించి.. బెదిరించి వివస్త్రను చెశాడు ఓ ప్రబుద్దుడు. దీంతో బయట అడుగు పెట్టాలి అంటేనే భయంగా ఉందంటున్నారు కొందరు మహిళలు. ఈ ఘటనలు మరవకముందే  జగద్గిరిగుట్ట,పేట్ బషీరాబాద్‌‌లో బాలికలపై అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి.

ఇలా రోజుల వ్యవధిలోనే సురారంలో ఇంటి నుండి బయటకు వచ్చిన మహిళ హత్యకు గురి అవ్వడం, అటు శంషాబాద్‌లో  మహిళను పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటన, తాజాగా మీర్‌పేట్‌లో బాలికపై సామూహిక అత్యాచారం లాంటి భయంకరమైన, దారుణమైన ఘటనలు మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలు, నిర్మానుష్యమైన ప్రాంతాలు, రోడ్లపై.. పోలీసులు మరింత ఫోకస్ పెట్టాలి కోరుతున్నారు మహిళలు. గస్తీ పెంచడంతో పాటు నేరస్థులకు కఠిన శిక్షలు వేయడం ద్వారా కొంతమేర మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడేవారికి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!