CM KCR: సమయం లేదు మిత్రమా.. మిగిలింది 5 నెలలే.. సిద్ధమవ్వండిక.. ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్..

తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అక్టోబర్‌ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని BRS ఇప్పటికే ప్రకటించి.. ఆ దిశగా సన్నాహాలు కూడా ప్రారంభించింది. బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

CM KCR: సమయం లేదు మిత్రమా.. మిగిలింది 5 నెలలే.. సిద్ధమవ్వండిక.. ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 17, 2023 | 5:51 PM

తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అక్టోబర్‌ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని BRS ఇప్పటికే ప్రకటించి.. ఆ దిశగా సన్నాహాలు కూడా ప్రారంభించింది. బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలుతీరుపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేసి.. ఎన్నిలకు సిద్ధమవ్వాలంటూ సూచించారు. బీఆర్ఎస్‌ విస్త్రృతస్థాయి సమావేశంలో మాట్లాడిన సీఎం ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని.. సిద్ధం కావాలంటూ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ తీసేస్తే మిగిలింది ఐదు నెలలేనంటూ దిశానిర్దేశం చేశారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో నియోజకవర్గాలకు పరిమితం కావాలంటూ సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రజలతో జరుపుకోవాలని ఆదేశించారు. తెలంగాణ తెచ్చింది మనమే.. అభివృద్ధి చేసింది మనమే అన్న నినాదంతో ముందుకెళ్లాలన్నారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులను..వచ్చాక జరిగిన అభివృద్ధిని వివరించాలని కేసీఆర్ సూచించారు. కర్ణాటక ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్న సీఎం కేసీఆర్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 105 సీట్లు వస్తాయని తెలిపారు.

దశాబ్దంలోనే శతాబ్దం అభివృద్ధి చేశామని.. దీనినే ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లండి అంటూ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ సూచించారు. ఎన్నికలు ఆరు నెలలకు వచ్చినా ఇప్పుడొచ్చిన 100 పైగా సీట్లు గెలుస్తున్నామంటూ ధీమా వ్యక్తంచేశారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపిపై ఎంత వ్యతిరేకత మొదలైందో అర్థమైందని పేర్కొన్నారు. గ్రామాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల దగ్గరే వేడుకలు చేయండి.. ఏ వర్గాలకు లబ్ధి జరుగుతుందో ఆయా వర్గాలతో కలిసి భోజనాలు చేయండి.. అంటూ బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..