AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ విస్త్రృతస్థాయి సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. దశాబ్ది ఉత్సవాలు, అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలుతీరుపై నేతలకు దిశానిర్దేశం చేస్తన్నారు గులాబీబాస్‌.

Telangana: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ విస్త్రృతస్థాయి సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!
Brs Party Meeting
Shiva Prajapati
|

Updated on: May 17, 2023 | 4:40 PM

Share

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. దశాబ్ది ఉత్సవాలు, అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలుతీరుపై నేతలకు దిశానిర్దేశం చేస్తన్నారు గులాబీబాస్‌.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి జూన్‌ 2 నాటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యి, పదో ఏడు ప్రారంభం కానున్న నేపథ్యంలో 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు కొనసాగనున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం ఎలా ఉండాలి? ఏయే అంశాలను పార్టీ ప్రతినిధులు ప్రజల్లో తీసుకెళ్లాలి అన్న అంశాలపై కేసీఆర్‌ డైరెక్షన్ ఇస్తున్నారు పార్టీ అధినేత కేసీఆర్‌.

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ఆగస్ట్ తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో నేతలను అప్రమత్తం చేసే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. మూడు నెలల్లో నియోజకవర్గంలో పనులన్నీ పూర్తి చేసి..మళ్లీ గెలిచేలా సిద్ధం కావాలని ఇప్పటికే నేతలకు హింట్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్న కేసీఆర్‌.. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ ప్రిపేర్ చేశారనే టాక్‌ వినిపిస్తోంది. వాటన్నింటిని శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. పార్టీ ప్రజా ప్రతినిధులకు వివరిస్తారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై