CM KCR: వాళ్లది ప్రైవేటైజేషన్.. మాది నేషనలైజేషన్.. BRS అధికారంలోకి వస్తే వెలుగు జిలుగుల భారతం: సీఎం కేసీఆర్

ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమరశంఖం పూరించారు. దేశానికి BRS అవసరం ఏంటో చెబుతూనే.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు చేస్తాం అన్నదీ స్పష్టంగా వివరించారు.

CM KCR: వాళ్లది ప్రైవేటైజేషన్.. మాది నేషనలైజేషన్.. BRS అధికారంలోకి వస్తే వెలుగు జిలుగుల భారతం: సీఎం కేసీఆర్
Brs Meeting
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 18, 2023 | 6:16 PM

ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమరశంఖం పూరించారు. దేశానికి BRS అవసరం ఏంటో చెబుతూనే.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు చేస్తాం అన్నదీ స్పష్టంగా వివరించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు.. దేశాన్ని కష్టాల నుంచి విముక్తి చేసేందుకు పుట్టేందే BRS అని చెప్పారు. తెలంగాణ మోడల్‌నే దేశమంతటా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశమంతటా కరెంట్ కష్టాలు ఉన్నాయన్నారు కేసీఆర్. ఒక్క తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కోతలేనని చెప్పారు. BRS అధికారంలోకి వస్తే.. 2 ఏళ్లలోనే వెలుగు జిలుగుల భారతాన్ని ఆవిష్కరిస్తామన్నారు. అలాగే రైతులకు కూడా ఉచిత కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని తెలిపారు. కేంద్రం ఏటా 25 లక్షల మందికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్లకు చేతకాకపోతే.. తమ ప్రభుత్వం వచ్చాక చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇక ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టడంపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS సర్కారు వస్తే.. LIC, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని జాతీయం చేస్తామని ప్రకటించారు. అలాగే కరెంట్‌ రంగానని కూడా పబ్లిక్‌ సెక్టార్‌లోనే ఉంచుతామని తెలిపారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత BJP సర్కారుకు మంచినీళ్లు ఇవ్వడం కూడా చేతకవడం లేదన్న కేసీఆర్.. దేశ వ్యాప్తంగా మిషన్‌ భగీరథ అమలు చేసి చూపిస్తామన్నారు. అలాగే సైన్యంలో ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు.

మోడీ ప్రభుత్వానిది ప్రైవేటైజేషన్ తమది నేషనలైజేషన్ అని పేర్కొన్నారు. 2024 తర్వాత మోడీ ప్రభుత్వం ఇంటికి వెళ్తుందని.. తాము ఢిల్లీకి వెళ్తామంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం అరాచకాలను అడ్డుకునేందుకు విపక్షాలను ఆదరించాలని సీఎం కోరారు. చాలా సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణం అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుందన్నారు. అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది. దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉంది. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని విమర్శించారు.

75ఏళ్ల స్వాతంత్ర్య భారత్‌లో ఇప్పటికీ చాలాచోట్ల విషపు మంచినీళ్లే ఉన్నాయన్నారు. దేశం లక్ష్యం కోల్పోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. నీళ్ల విషయంలో ట్రెబ్యునళ్ల ఏర్పాట్లపైనా కేసీఆర్ ఘాటుగా స్పందిచారు. ఉలుకూపలుకులేని ట్రెబ్యునళ్లతో ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు అని ప్రశ్నించారు. సాగుకు ఆమోదయోగ్యమైన భూమి ఉంది. నీరుంది. వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ వాడుకునే తెలివి కేంద్రంలోని ప్రభుత్వాలకు లేకపోయిందని విమర్శించారు కేసీఆర్.

ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టడంపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కారు వస్తే.. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని జాతీయం చేస్తామని ప్రకటించారు. అలాగే కరెంట్‌ రంగానని కూడా పబ్లిక్‌ సెక్టార్‌లోనే ఉంచుతామన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం అమ్మేసినా బీఆర్‌ఎస్ పవర్‌లోకి వస్తే మళ్లీ జాతీయం చేస్తుందన్నారు కేసీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!