CM KCR: ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు.. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు.. మున్సిపాలిటీలకు..
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మోడీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. మోడీది ప్రైవేటైజేషన్ తమది నేషనైలేజషన్ అని పేర్కొన్నారు. 2024 తర్వాత మోడీ ప్రభుత్వం ఇంటికి వెళ్తుందని.. తాము ఢిల్లీకి వెళ్తామంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మోడీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. మోడీది ప్రైవేటైజేషన్ తమది నేషనైలేజషన్ అని పేర్కొన్నారు. 2024 తర్వాత మోడీ ప్రభుత్వం ఇంటికి వెళ్తుందని.. తాము ఢిల్లీకి వెళ్తామంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం అరాచకాలను అడ్డుకునేందుకు విపక్షాలను ఆదరించాలని సీఎం కోరారు. చాలా సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, బీఆర్‌ఎస్ ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఖమ్మంలోని గ్రామ పంచాయతీలకు వరాల జల్లు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దతాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలకు ఒక్కోదానికి రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి మరొక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతోపాటు ఖమ్మం హెడ్ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. నెల రోజుల్లోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని.. జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..