CM KCR: తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త.. నకిరేకల్ సభలో కొత్త హామీ ప్రకటన..
బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ సభల్లో మరోసారి కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేశారు కేసీఆర్. కాంగ్రెస్ రాజ్యంలో కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు కేసీఆర్ శుభవార్త చెప్పారు.

బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ సభల్లో మరోసారి కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేశారు కేసీఆర్. కాంగ్రెస్ రాజ్యంలో కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్లకు అయ్యే ఖర్చును మాఫీ చేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. ధరణి పోర్టల్‌ను తీసేసి భూమాత పెడుతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని.. అది భూమాతనా.. భూమేతనా.. అని విమర్శించారు. ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, ఈ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని కేసీఆర్ సూచించారు. కమ్యూనిస్టు సోదరులు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని నకిరేకల్ సభలో కోరారు.
నకిరేకల్ సభలో కేసీఆర్ ప్రసంగం..
కేసీఆర్ ఫన్నీ కామెంట్స్ వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..