CM KCR Press Meet: కేంద్రం చేతులెత్తేసింది.. కొనుగోలు కేంద్రాలు ఉండవు.. యాసంగిలో పంటలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..
వరి ధాన్యాన్ని కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
CM KCR Press Meet: వరి ధాన్యాన్ని కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం.. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని స్పష్టం చేశారు. కోట్ల మంది బాధ్యతలను చూసే కేంద్రం.. ఓ చిల్లర కొట్టు యజమానిలా మాట్టాడుతోందని మండిపడ్డారు. 700 మంది రైతులను పొట్టనపెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అని విమర్శించారు. కోట్ల మంది బాధ్యతలను చూసే కేంద్రం.. ఓ చిల్లర కొట్టు యజమానిలా మాట్టాడుతోందని అన్నారు. కేంద్రం లంగనాటకం ఆడుతుంది…కావాలనే డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి ఉల్టాపల్టా మాట్లాడుతోందని వెల్లడించారు.
దేశంలో ధాన్యాన్ని సేకరిచండం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం, దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్ నిల్వ చేయడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో పేదల వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. వారి నిర్ణయాలు సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం మోపే విధంగా ఉంటున్నాయన్నారు. కేవలం ఒక రంగం అనే కాకుండా అనేక రంగాల్లో ఇలాంటి విధానాలనే కేంద్రం అవలంబిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.
దేశంలో ఆహార ధాన్యాలను సేకరించడం.. సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం.. అలాగే దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్స్ నిలువ చేయడం, సేకరించిన ధాన్యంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆహార కొరత ఏర్పడకుండా.. ఆహార రక్షణ కోసం ఫుడ్ సెక్యూరిటీ కోసం బఫర్ స్టాక్స్‌ను మెయిన్‌టెన్ చేస్తాయి. ఆ తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆహార ధాన్యాలను అందించి నిరుపేదలకు అందించడం.. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగ బద్ధంగా కేంద్రం మీద ఉన్న బాధ్యత.
ఇవి కూడా చదవండి: Leptin and Obesity: మీలో ఈ హార్మోన్లు పనిచేయకపోతే డయాబెటిస్ వచ్చినట్లే.. అవేం చేస్తాయో తెలుసా..
Kishan Reddy: ఆయన మొండి వైఖరి వల్లే రైతులకు తీవ్ర నష్టం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..