RTC MD Sajjanar: కుటుంబ సభ్యులతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. వినూత్నరీతిలో సజ్జనార్‌ ప్రచారం..

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి భద్రత కల్పించేందుకు వినూత్న రీతిలో ముందుకెళుతున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం సురక్షితమని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు సజ్జనార్‌.

RTC MD Sajjanar: కుటుంబ సభ్యులతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. వినూత్నరీతిలో సజ్జనార్‌ ప్రచారం..
Sajjanar Family
Follow us

|

Updated on: Nov 29, 2021 | 9:02 PM

TS RTC MD Sajjanar: ఎస్పీగా పనిచేసినా.., పోలీస్‌ కమిషనర్‌గా డ్యూటీ చేసినా.. ఓ సంస్థకు ఎండీగా పనిచేసినా ఆయన రూటే సెపరేటు. ఆయనే సజ్జనార్‌. ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్‌ చూపిస్తారు ఐపీఎస్‌ ఆఫీసర్ వీసీ సజ్జనార్. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆర్టీసీ చక్రాలను ప్రగతి పథంలో నడిపేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి భద్రత కల్పించేందుకు వినూత్న రీతిలో ముందుకెళుతున్నారు ఆర్టీసీ ఎండీ. తాజాగా తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు సజ్జనార్. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం సురక్షితమని వినూత్నంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఎండీ.

ఆర్టీసీ ఎండీగా గత సెప్టెంబరు 3న బాధ్యతలు చేపట్టారు వీసీ సజ్జనార్‌. వెంటనే సంస్థ పురోగతిపై దృష్టిసారించి, సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇలా 81 రోజుల వ్యవధిలో 370 ఫిర్యాదులు రాగా, వాటిలో 364 పరిష్కరించారు సజ్జనార్. ప్రజలు, విద్యార్థులు, మహిళల నుంచి వచ్చిన వినతులను ప్రత్యేకంగా పరిశీలించి, 151 కొత్త సర్వీసులను ప్రారంభించారు.

కొత్తవి, పునరుద్ధరించినవి కలిపి మొత్తం 510 సర్వీసులు మొదలయ్యాయి. అంతే కాకుండా పెళ్లిళ్లకు, శబరిమల యాత్రకు.. ఇలా అన్నింటికి బస్సులను రెంట్‌కు ఇస్తోంది ఆర్టీసీ. సంస్థ ప్రగతి కోసం ఎండీ, అధికారులు, ఉద్యోగులు చూపుతున్న నిబద్ధతను అభినందిస్తున్నారు ప్రజలు.

ఇవి కూడా చదవండి: Leptin and Obesity: మీలో ఈ హార్మోన్లు పనిచేయకపోతే డయాబెటిస్ వచ్చినట్లే.. అవేం చేస్తాయో తెలుసా..

Kishan Reddy: ఆయన మొండి వైఖరి వల్లే రైతులకు తీవ్ర నష్టం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..