Bharat Biotech: ఇతర దేశాలకూ కొవాగ్జిన్.. ఎగుమతులు ప్రారంభించిన భారత్ బయోటెక్
Bharat Biotech Covaxin: హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఎగుమతులను ప్రారంభించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విదేశీ ఆర్డర్ల ఎగుమతిని ఈ నెలలో
Bharat Biotech Covaxin: హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఎగుమతులను ప్రారంభించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విదేశీ ఆర్డర్ల ఎగుమతిని ఈ నెలలో చేపట్టినట్లు భారత్ బయోటెక్ సోమవారం వెల్లడించింది. డిసెంబర్‌లో ఎగుమతిని మరింతగా పెంచుతామని ఫార్మా కంపెనీ తెలిపింది. ఇప్పటికే కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి చాలా దేశాలు అనుమతి ఇచ్చాయని ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో వాటికి కూడా ఎగుమతులు ప్రారంభించనున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అనంతరం అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు కొవాగ్జిన్‌కు అనుమతినిచ్చాయి. దీంతోపాటు.. ఆయా దేశాలకు కొవాగ్జిన్ సరఫరా చేయాలంటూ భారత్ బయోటెక్ కంపెనీకి ఆర్డర్లు సైతం వచ్చాయి. దీనిలో భాగంగా భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ల ఎగుమతులను ప్రారంభించింది. డిసెంబర్ నెలలో చాలా దేశాలకు ఎగుమతులు చేయనున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.
కోవాగ్జిన్ ఎగుమతులకు అనుమతులు మంజూరు చేసిన భారత ప్రభుత్వానికి భారత్ బయోటెక్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. కరోనా మహమ్మారిపై అంతర్జాతీయంగా జరుగుతున్న పోరాటంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ కీలకంగా మారిందని భారత్ బయోటెక్ తెలిపింది. ఇదిలాఉంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 122 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. భారత్‌లో వ్యాక్సినేషన్‌కు అవసరమైన డోసుల నిల్వలు సరిపడా ఉండటంతో.. కేంద్ర ప్రభుత్వం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
#COVAXIN #BharatBiotech #COVID19 #PandemicofVaccinated @MoHFW_INDIA pic.twitter.com/hwyyKOzufv
— BharatBiotech (@BharatBiotech) November 29, 2021
Also Read: