TSRTC MD Sajjanar: రక్తదానం చేయడండి.. బస్‌లో ఫ్రీగా ప్రయాణించండి.. రాష్ట్ర వ్యాప్తంగా రేపు శిబిరాలు..
TSRTC Blood Donation Camps: టీఎస్ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. పలు మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులు,
TSRTC Blood Donation Camps: టీఎస్ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. పలు మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలపై సజ్జనార్ స్వయంగా స్పందిస్తూ.. చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు పలు సంస్కరణలకు వీసీ సజ్జనార్ నాంది పలుకుతున్నారు. దీంతోపాటు ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా, స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బస్ డిపోల్లో రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వీసీ సజ్జనార్ తెలిపారు. పౌరులతోపాటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా రక్తదానానికి ముందుకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు. తలసేమీయా బాధితుల కోసం రేపు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ శిబిరాల్లో రక్తదానం చేసిన వారికి రేపు రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అవకాశం కల్పిస్తున్నట్లు వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని తలసీమియా బాధితుల కోసం ఆర్టీసీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.
30-11-2021 రోజున రక్తదానం చేసేవారికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆఫర్:-
టి.ఎస్.ఆర్.టి.సి వారు 30-11-2021 రోజున నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో రక్తం దానం చేసిన వారికి, వారి వారి గమ్యస్థానాలకు #ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది.
“రక్త దానం చెయ్యండి నిండు జీవితం కాపాడండి” https://t.co/snQIeLlyTr
— Hyderabad Blood Donors (@hydblooddonors) November 29, 2021
Also Read: