CM Jagan: ఆ విషయంలో దూకుడు ప్రవర్తించండి.. కోవిడ్‌పై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
CM Jagan: కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టకముందే కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. తాజాగా ఏపీలో క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
CM Jagan: కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టకముందే కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. తాజాగా ఏపీలో క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలని, వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్ అని అధికారులతో అన్నారు. టార్గెట్ పెట్టుకుని మరీ వ్యాక్సినేషన్ చేయండి. అందరూ కూడా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలి. జనాలు గుమిగూడకుండా చర్యలు చేపట్టండి. మాస్క్ విషయంలో మళ్ళీ డ్రైవ్ చేయండి. గతంలో ఉన్న నిబంధనలు అమలు చేయండి అని అన్నారు. క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే జరగాలి. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే రెండూ చేయండి. ఆక్సిజన్ పైప్‌లైన్లు సరిగ్గా ఉన్నాయా? లేవా? డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోండి. గతంలో కోవిడ్ చికిత్సకోసం వాడుకున్న అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా? లేవా? .. ఆక్సిజన్ లైన్స్ సరిగ్గా ఉన్నాయా? లేవా? సరిచూసుకోండి. మాస్క్‌కు సంబంధించిన గైడ్ లైన్స్ వెంటనే ఎన్‌ఫోర్స్ చేయండి అని జగన్ అధికారులకు సూచించారు.
డిసెంబర్ నెలాఖరుకల్లా రెండు కోట్ల డోసులు పూర్తి చేయండి:
కాగా, వ్యాక్సినేషన్ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యమని, డిసెంబర్ నెలాఖరుకల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్న టార్గెట్ పెట్టుకోండి అని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్స్ మాక్ డ్రిల్ చేసుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్ మెడికల్ టీమ్స్‌ను ఏర్పాటుచేసి ఏపీకి వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు మాత్రమే చేయండి, ర్యాపిడ్ టెస్ట్‌లు వద్దు అని సూచించారు.
ఇవి కూడా చదవండి: