Omicron: కొత్త వేరియంట్‌కు WHO ఒమిక్రాన్‌ అనే పేరు ఎందుకు పెట్టింది? చైనా అధ్యక్షుడికి ఈ వేరియంట్‌కు సంబంధం ఏమిటి?

Omicron: కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వేరియంట్‌ ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్‌కు ఒమిక్రాన్‌ అనే పేరు పెట్టింది ప్రపంచ..

Omicron: కొత్త వేరియంట్‌కు WHO ఒమిక్రాన్‌ అనే పేరు ఎందుకు పెట్టింది? చైనా అధ్యక్షుడికి ఈ వేరియంట్‌కు సంబంధం ఏమిటి?
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 7:15 PM

Omicron: కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వేరియంట్‌ ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్‌కు ఒమిక్రాన్‌ అనే పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ప్రపంచ దేశాలను సైతం అప్రమత్తం చేసింది డబ్ల్యూహెచ్‌వో. అతి వేగంగా విస్తరిస్తున్న B.1.1.529 వేరియంట్ ప‌ట్ల ఇప్పటికే దేశాలు అప్రమత్తం అయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌పై ఎలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే కొత్త వేరియంట్‌కు, చైనా అధ్యక్షుడికి సంబంధం ఏంటనేది చాలా మందికి అనుమానం తలెత్తుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కరోనా మహమ్మారి బయటపడిన కొత్తలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్‌-19 అని నామకరణం చేసింది. ఆ తర్వాత పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్లకు కూడా పేర్లు పెట్టింది. ఆ పేర్లను గ్రీకు వర్ణమాల ప్రకారం.. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అంటూ డబ్ల్యూహెచ్‌ నామకరణం చేస్తూ వచ్చింది. ఇందులో డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరంగా విజృంభించింది. ఇప్పుడు మరో కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చింది. అయితే దీనికంటే ముందు గ్రీకు వర్ణమాల ప్రకారం డెల్టా తర్వాత వేరియంట్‌ న్యూ (Nu) అని పేరు పెట్టాల్సి ఉంది. ఒక వేళ ‘ను’ తర్వాత కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తే కనుక అప్పుడు దానికి Xi అని నామకరణం చేయాల్సి ఉంది.

తెలుగు వర్ణమాలలో లాగే గ్రీకు వర్ణమాలలో కూడా..

అయితే తెలుగు వర్ణమాలలో అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ.., ఆంగ్ల అక్షరమాలలోని ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్‌.. మాదిరిగా గ్రీకు అక్షరమాలలో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఉన్నాయి. ఓ కోవిడ్ వేరియంట్‌కు ఈ అక్షరాలలోని డెల్టాగా నామకరణం చేశారు. ఆ తర్వాత కొత్తగా వచ్చే వేరియంట్‌కు ‘ను’ అని నామకరణం చేయాల్సి ఉంది. గ్రీకు వర్ణమాలలో ‘ను’ తర్వాత ‘జి’ వస్తుంది. ఈ ‘జి’ అనే పదం చైనా అధ్యక్షుడు పేరు వస్తుంది. ఇది గ్రీకు పదం. అందుకే వీటిని వదిలేసి ‘ఒమిక్రాన్‌’ పేరును పెట్టింది డబ్ల్యూహెచ్‌వో.

‘Nu’, ‘Xi’ రెండు పదాలను వదిలేసి..

మొదటి నుంచి కరోనా విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటోంది చైనా. ల్యాబ్‌లోనే వైరస్‌ పుట్టిందని ప్రపంచ దేశాలు సైతం ఆరోపణలు గుప్పించాయి. ఇక అమెరికా మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీంతో దేశాలు సైతం చైనాపై ఆగ్రహంతో మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో దక్షిణాఫ్రికాలో పుట్టిన B.1.1.529 తర్వాత వచ్చే వేరియంట్‌ పేరు చైనా అధ్యక్షుడి పేరుకు దగ్గరగా ఉంది. ఆ పేరు పెడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో భావించింది. అలా పేరు పెట్టినట్లయితే అవనసరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని భావించి ‘Nu’, ‘Xi’ రెండు అక్షరాలను వదిలేసి ఆ తర్వాత వచ్చే అక్షరం ఒమిక్రాన్‌ పేరును కొత్త వేరియంట్‌కు పెట్టింది. ఈ నేపథ్యంలో హార్వర్డ్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన మెడిసన్‌ ప్రొఫెసర్‌ మార్టిన్‌ కుల్డార్ఫ్‌ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఈ పేరుపై ఇతరులు కూడా వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

WHO: పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు.. ఇప్పటి వరకు బయటపడ్డ వేరియంట్లకు డబ్ల్యూహెచ్‌వో ఎలాంటి పేర్లు పెట్టిందంటే!

వైరస్‌లు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి..? ఆందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్‌.. గుర్తించని వైరస్‌లు మరెన్నో..!