Monkey Festival: అట్టహాసంగా కోతుల ఫెస్టివల్.. భారీగా పాల్గొన్న పర్యాటకులు.. ఎక్కడంటే..? వీడియో..
Thailand Monkey Festival: ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా కోతులే.. చాలా మంది కోతుల కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకువచ్చారు. ఇష్టమైన పండ్లను ఆరిగిస్తూ కోతులు తెగ ఎంజాయ్ చేస్తున్నాయి. ఇదంతా
Thailand Monkey Festival: ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా కోతులే.. చాలా మంది కోతుల కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకువచ్చారు. ఇష్టమైన పండ్లను ఆరిగిస్తూ కోతులు తెగ ఎంజాయ్ చేస్తున్నాయి. ఇదంతా ఎక్కడని ఆశ్చర్యపోతున్నారు కదా.. థాయ్‌లాండ్ మంకీ ఫెస్టివల్‌లోని దృశ్యాలు. కరోనా మహమ్మారితో రెండేళ్లపాటు నిలిచిపోయిన మంకీ ఫెస్టివల్.. అట్టహాసంగా ప్రారంభమైంది. వేలాది కోతులు అక్కడికి చేరుకొని వాటికి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలను హాయిగా ఆరగిస్తున్నాయి. దీంతో థాయిలాండ్‌లోని లోప్‌బురి అనే ప్రాంతం వేలాది మంది టూరిస్టులు, వానరాలతో కిక్కిరిసి పోయింది. మంకీ ఫెస్టివల్ కోసం వేలాది పండ్లను, పలు ఆహఆర పదార్థాలను అక్కడ సమకూర్చారు. ఈ ఫెస్టివల్‌లో పర్యాటకులు, స్థానికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మంకీ ఫెస్టివల్ కోసం రెండు టన్నుల పండ్లు, కూరగాయలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఫెస్టివల్‌లో కోతులు పలువురు వ్యక్తులపై కూర్చొని హాయిగా పండ్లను తింటున్నాయి. అందుకే లోప్‌బురిని “మంకీ ప్రావిన్స్” అని పిలుస్తారు. కాగా.. రెండు కరోనా టీకాలు తీసుకున్న పర్యాటకులను అనుమతిస్తూ థాయ్‌లాండ్ ప్రభుత్వం నవంబర్‌లో నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా సర్టిఫికెట్‌తో పనిలేకపోవడంతో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే కోతుల పండుగను నిర్వహించడంతో పర్యాటకులు లోప్‌బురి ప్రాంతానికి క్యూ కడుతున్నారు.
కాగా.. థాయిలాండ్‌లోని లోప్‌బురి అనే ప్రాంతంలోనే ఈ మంకీ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ప్రతి ఏడాది నవంబర్ చివరి వారంలో నిర్వహిస్తారు. కానీ.. గత రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఆ ఫెస్టివల్ నిర్వహించడం లేదు. దాదాపు రెండేళ్ల తర్వాత కోతులు ఇష్టంగా ఆహారాన్ని తింటున్నాయంటూ నిర్వాహకులు తెలిపారు.
వీడియో..
“Feast and frolics”!
Thousands of monkeys in central #Thailand have been treated to over two tons of fruits and vegetables in the town’s first annual Monkey Festival since the beginning of the pandemic. #monkey #Thailand #feast #tradition pic.twitter.com/siAhA5Uz0l
— Ayushi Agarwal (@ayu_agarwal94) November 29, 2021
కాగా.. ఈ ఫెస్టివల్‌ను ఊరి పెద్ద యోంగ్యుత్ కిత్వాటానాసోంత్ నిర్వహిస్తారు. ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. సాయం చేసేందుకు ఈ ఫెస్టివల్‌ను. కాగా.. ఈసారి వీల్‌చైర్ మంకీస్ అనే థీమ్‌తో వేడుకను నిర్వహిస్తున్నారు. దీనిద్వారా అక్కడ అవసరం ఉన్న వాళ్లకు 100 వీల్ చైర్లను ఉచితంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Also Read: