Video Viral: ఇదేం వంటకం.. చాక్లెట్ సమోసా పావ్ బాజీ.. తయారీ చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..
సమోసా.. అంటే అందరికే ఇష్టమైన వంటకమే. ముఖ్యంగా స్ట్రీట్ సమోసా అంటే అసలు వదిలిపెట్టరు.. వయసుతో సంబంధం
సమోసా.. అంటే అందరికే ఇష్టమైన వంటకమే. ముఖ్యంగా స్ట్రీట్ సమోసా అంటే అసలు వదిలిపెట్టరు.. వయసుతో సంబంధం లేకుండా సమోసాను లాగించేస్తుంటారు. ఉల్లిపాయ సమోసా.. ఆలు సమోసా.. మసాలా సమోసా ఇలా రకారకాల సమోసాలను ఇదివరకే రుచి చూసి ఉంటారు. కానీ చాక్లెట్ సమోసాను ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అది కూడా చాక్లెట్ సమోసా పావ్ బాజీ. వింటుంటూనే కొత్తగా..విచిత్రంగా ఉంది కదూ. కానీ ఇప్పుడు ఇదే వంటకం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ విచిత్రం వంటకం చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ఆ వీడియో ఓ వీధి వ్యాపారి బ్రెడ్ పై చాక్లెట్ క్రిమ్ వేసి.. ఆ తర్వాత చిన్న సమోసాను వాటి మధ్యలో పెట్టి తిరిగి ఆ సమోసా పై క్రిమ్ చేస్తాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ విచిత్ర వంటకాన్ని చూసి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమోసాను ఎప్పుడూ చూడలేదని.. ఇలాంటి విచిత్ర వంటలను ఆపాలని కామెట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను @rjkhurki ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు.
View this post on Instagram
గతంలోనూ టమోటా కచప్ అనే విచిత్ర వంటకం సోషల్ మీడియోలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ యువకుడు పెద్ద బాణాలిలో ఇసుక వేసి ఎక్కువగా వేడి చేసి.. అందులో కాస్త పెద్ద పరిమాణం ఉన్న టమోటాలను వేసి కలిపాడు. ఆ ఇసుకలో టమోటాలను పూర్తిగా కాల్చి ఆ తర్వాత వాటిని నీటిలో శుభ్రం చేస్తున్నాడు. తర్వాత వాటిని ఒక ఆకులో వేసి వాటిపై మాసాల క్రీమ్ వేసి విక్రయిస్తున్నాడు.