Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి హెల్త్ బులెటిన్ విడుదల.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. నిన్న శ్వాస సంబంధిత సమస్యలతో
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. నిన్న శ్వాస సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన చేరారు. ఇటీవల సిరివెన్నెల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
“టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వయసు 66 సంవత్సరాలు. నవంబర్ 24న న్యూమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారు. ఐసీయూలో ఉన్న సిరివెన్నెల త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నాము. సిరివెన్నెల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం ” అని వైద్యులు తెలిపారు.
సిరివెన్నెల సీతారామశాస్ర్తి తెలుగు చిత్రపరిశ్రమలో దశాబ్ధాలుగా సేవలను అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన జర్నీలో ఎన్నో సూపర్ హిట్ పాటలను రచించిన సిరివెన్నెల స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.
Also Read: Kamal Haasan: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వైద్యులు.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
Taapsee Pannu: అందంగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డాను.. కానీ.. ఆసక్తికర విషయాలను చెప్పిన తాప్సీ..