Taapsee Pannu: అందంగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డాను.. కానీ.. ఆసక్తికర విషయాలను చెప్పిన తాప్సీ..

వెండితెరపై హీరోయిన్‏గా నిలబడాలంటే నటనతోపాటు.. అందం కూడా ముఖ్యమే. ముఖ్యంగా సినీ రంగంలో ఉండేవారు అందంగా

Taapsee Pannu: అందంగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డాను.. కానీ.. ఆసక్తికర విషయాలను చెప్పిన తాప్సీ..
Taapsee
Follow us

|

Updated on: Nov 29, 2021 | 5:05 PM

వెండితెరపై హీరోయిన్‏గా నిలబడాలంటే నటనతోపాటు.. అందం కూడా ముఖ్యమే. ముఖ్యంగా సినీ రంగంలో ఉండేవారు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తమ లుక్ పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంటారు. అలా తాను అందంగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డానని తెలిపింది హీరోయిన్ తాప్సీ. తప్పడ్, హసీనా దిల్ రుబ వంటి విభిన్ని చిత్రాల్లో నటించి బాలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్ర కథనాయికగా దూసుకుపోతుంది తాప్సీ. అందం, అభినయంతో కేవలం గ్లామరస్ పాత్రలతోనే కాకుండా.. ఫీమేల్ ఒరియెంటేడ్ చిత్రాలను చేస్తూ బీటౌన్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మిథాలీ రాజ్ బయోపిక్ లో నటిస్తుంది. ఈ సందర్భంగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది తాప్సీ.

తాప్సీ మాట్లాడుతూ… నా కళ్లు పెద్దగా.. చూడచక్కగా ఉండవు.. అలాగే సినిమాల్లో కనిపించే హీరోయిన్స్ మాదిరిగా నా ముక్కు సన్నగా ఉండదు.. పెదవులు కూడా అందంగా కనిపించవు.. ఆఖరికీ నా జుట్టు కూడా రింగు రింగులుగా ఉంటుందని తెలిపింది తాప్సీ. టీవీల్లో కనిపించే వారికి తనలాంటి జుట్టు ఉండదని.. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. సెలూన్ కు వెళ్లి రకరకాల కెమికల్స్ తో హెయిర్ ను అందంగా మార్చుకునేదాన్ని.. అలా ఓ రెండుసార్లు చేయించుకున్నాక జుట్టు రాలడం ప్రారంభమైంది.. దీంతో మళ్లీ వాటి జోలికి పోలేదని చెప్పుకొచ్చింది తాప్సీ. నిజం చెప్పాలంటే అందానికి పరిమితులుగా చెప్పుకునేవాటికి నేను సరిపోను. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను నేను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ విజయం సాధించలేదు. జీవితాన్ని ప్రేమతో జీవించాలని.. మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్యప్రపంచానికి ఎంతో అందంగా కనిపిస్తామని అర్థమైంది.. ఆ సమయం నుంచి అందంపై నా అభిప్రాయం మారింది అని తాప్సీ తెలిపింది.

Also Read: RRR Trailer: బిగ్ అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్.. ఎప్పుడంటే..

Bigg Boss 5 Telugu Promo: ప్రియాంకకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్‏లో నామినేషన్స్ హీట్..