AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: టీడీపీ బాటలో బీఆర్‌ఎస్‌.. తెలుగుదేశం విధానాన్ని పార్టీ ఆఫీసులో అమలు చేస్తున్న కేసీఆర్‌

తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా ప్రియారిటి ఇవ్వని బీఆర్‌ఎస్‌ ఇప్పుడు పార్టీలో సమూల మార్పుల దిశగా అడుగులేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే పార్టీని ప్రభుత్వం అంటూ.. అడపాదడపా మినహా పెద్దగా తెలంగాణ భవన్‌లో హడావుడి ఉండేది కాదు. ఇప్పుడు ఒక పూర్తి ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలని..

BRS: టీడీపీ బాటలో బీఆర్‌ఎస్‌.. తెలుగుదేశం విధానాన్ని పార్టీ ఆఫీసులో అమలు చేస్తున్న కేసీఆర్‌
Rakesh Reddy Ch
| Edited By: Subhash Goud|

Updated on: Oct 11, 2024 | 5:30 PM

Share

తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా ప్రియారిటి ఇవ్వని బీఆర్‌ఎస్‌ ఇప్పుడు పార్టీలో సమూల మార్పుల దిశగా అడుగులేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే పార్టీని ప్రభుత్వం అంటూ.. అడపాదడపా మినహా పెద్దగా తెలంగాణ భవన్‌లో హడావుడి ఉండేది కాదు. ఇప్పుడు ఒక పూర్తి ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నిర్మాణం, కార్యాలయ కార్యకలాపాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. అధికారంలో ఉన్న లేకపోయినా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ విధానం గురించి అన్ని పార్టీల నేతలు మాట్లాడుకుంటారు.

ఇప్పుడు కేసీఆర్‌ కూడా గతంలో రెండు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా, ఎన్టీఆర్ ట్రస్ట్ మెంబర్‌గా, తెలుగుదేశం పార్టీ కార్యాలయ బాధ్యులుగా పని చేసిన రావుల చంద్రశేఖర్‌ని ప్రస్తుతం తెలంగాణ భవన్ ఇన్చార్జిగా నియమించారు. తెలుగుదేశం పార్టీలో నేతల ప్రెస్ మీట్లకు ముందు ఎలాగైతే పార్టీ నుంచి కొంత సమాచారం అందిస్తారు. ఇప్పుడు అలాంటి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నిత్యం ఎవరో ఒక నేత తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై రోజు కనీసం రెండు మూడు ప్రెస్ మీట్ అయినా ఉంటున్నాయి.

వచ్చిపోయే కార్యకర్తలకు, మీడియా సిబ్బందికి ప్రత్యేకంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయించారు. పార్టీ కార్యకర్తల మెంబర్‌షిప్‌తో పాటు వచ్చే ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక విభాగం, పబ్లిక్ రిలేషన్స్- సోషల్ మీడియా కోసం మరొక వింగ్, రోజువారి కార్యకలాపాల కోసం మరికొంతమందిని ప్రత్యేకంగా నియమించారు. వీటితోపాటు త్వరలోనే కార్యకర్తలకు శిక్షణ తరగతులు కూడా ప్రారంభిస్తున్నట్లుగా సమాచారం.

వీలైనన్ని సార్లు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ తెలంగాణ భవన్‌లోనే అందుబాటులో ఉంటున్నారు. మాజీ మంత్రులు కూడా తమ జిల్లాలకు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో తెలంగాణ భవన్‌లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక వీటితోపాటు రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరించడానికి మరో స్పెషల్ సెల్, హైడ్రా బాధితుల కోసం ప్రత్యేక లీగల్‌సేల్‌, సోషల్ మీడియా ప్రతినిధులను అరెస్టు చేస్తే వారికి వెంటనే న్యాయ సాయం అందించడానికి మరి కొంతమంది ఇలా తెలంగాణ భవన్ ను ఫుల్ బిజీ చేశారు కేసీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..