CM KCR: కేటీఆర్, కవితతో కొండగట్టుకు సీఎం కేసీఆర్.. 25ఏళ్ల నాటి ఫోటోలు వైరల్..
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఆయన పాత ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నేతగా కొనసాగుతున్న కాలంలో..
‘‘కొండగట్టు అంజన్న ఆలయం ప్రపంచం దృష్టిని ఆకర్షించాలి. దేశంలో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా మారాలి. మళ్ళీ వస్తా, సమీక్ష చేస్తా’’ అంటూ కొండగట్టు అంజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గతంలో ఇచ్చిన వంద కోట్లకు అదనంగా మరో 500 కోట్లను మంజూరు చేశారు. మొత్తం రూ.600 కోట్లతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని పుణ్యక్షేత్రంగా మార్చాలని.. బృహత్తర ప్రాజెక్ట్ లో భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే.. కొండగట్టు అనే పేరు రావాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డును అభివృద్ధి చేయాలని సూచించారు. సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. హనుమాన్ జయంతి దేశంలోనే గొప్పగా కొండగట్టులో జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్, ఆలయం, పరిసరాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఆయన పాత ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నేతగా కొనసాగుతున్న కాలంలో తన కుటుంబసభ్యులతో కలిసి కొండగట్టుకు వచ్చి ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్నారు. కొండపై కుటుంబసభ్యులు, బంధువులతో సరదాగా గడిపారు. నాడు చిన్న పిల్లలైన కేటీఆర్, కవితతో సరదాగా ఆడుకుంటూ సీఎం కేసీఆర్ కనిపించారు. నాటి ఫొటోలు తాజాగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అనంతరం, కేసీఆర్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత కొండగట్టుకు వచ్చారు. చివరిసారిగా ఆయన 1998లో కొండగట్టు ఆలయానికి వచ్చినట్లు పేర్కొంటున్నారు. అప్పటికీ ఇంకా ఉద్యమ ప్రస్థానం మొదలుకాలేదు. ఈ తర్వాత ఉద్యమం ప్రారంభం, ఎన్నికల సమయాల్లో పలుమార్లు జగిత్యాలకు వచ్చినా.. కొండగట్టు ఆలయాన్ని మాత్రం సందర్శించలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కేసీఆర్ కొండగట్టులో పర్యటించడం ఇదే తొలిసారి.
Now it’s #Kondagattu’s turn for its overal facelift by developing another landmark mythological structure. #Throwback pics from the view point place, when we had numerous Darshans of Kondagattu Anajanna along with our Hon’ble CM Sri KCR garu and family. pic.twitter.com/Rz31qoggA1
— Santosh Kumar J (@MPsantoshtrs) February 15, 2023
గతంలో ఎన్నో సభలు, సమావేశాల్లో కొండగట్టు, ధర్మపురి, వేములవాడ రాజన్న ఆలయాలను యాదాద్రి వలే గొప్ప పుణ్య క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా కొండగట్టు ఆలయానికి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి నేతృత్వంలో మాస్టర్ ప్లాన్ ను కూడా సిద్ధం చేయించి.. ప్రాణాళికలను అమలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..