TG Assembly: అసెంబ్లీలో కాక పుట్టించిన ఎమ్మెల్యే దానం కామెంట్స్.. వాకౌట్ చేసిన బీఆర్ఎస్

అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్లు కాక పుట్టించాయి. బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చెప్పలేని భాష ఉపయోగించడంతో అటు బీఆర్‌ఎస్‌ సభ్యులు కూడా కౌంటర్ ఇచ్చారు.

TG Assembly: అసెంబ్లీలో కాక పుట్టించిన ఎమ్మెల్యే దానం కామెంట్స్.. వాకౌట్ చేసిన బీఆర్ఎస్
Danam Nagendar
Follow us

|

Updated on: Aug 02, 2024 | 6:23 PM

అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్లు కాక పుట్టించాయి. బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చెప్పలేని భాష ఉపయోగించడంతో అటు బీఆర్‌ఎస్‌ సభ్యులు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌.. సభా రూల్స్‌కి విరుద్ధంగా ఎవరూ దూషణలకు దిగడం మంచిది కాదన్నారు. దీంతో తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు దానం.

తెలంగాణ అసెంబ్లీలో హైదరాబాద్‌ మహానగరం అభివృధ్ధిపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించారని ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయి స్పందించారు. సభలో దానం నాగేందర్ మాట్లాడవద్దంటూ నినాదాలు చేశారు. ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా స్పీకర్ పోడియంవైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిగా దానం కూడా పోడియంవైపు రావడంతో కాంగ్రెస్‌ సభ్యులు ఆయన్ను వెనక్కి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదంటూ ఎమ్మెల్యే కేటీఆర్‌ తోసహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా సభను వాకౌట్ చేసి, బయటకు వెళ్లిపోయారు. మరోవైపు, తాను తప్పుగా మాట్లాడడలేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు దానం నాగేందర్. హైదరాబాద్‌పై చర్చ సందర్భంగా తన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 6 సార్లు గెలిచి అసెంబ్లీకి వచ్చానన్న దానం, తప్పుగా మాట్లాడినట్లు ఉంటే, తన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే, దానం నాగేందర్‌ చేసిన వ్యాఖ్యల్లో అన్‌-పార్లమెంటరీ వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..