Telangana: నన్ను చంపాలని‌ కుట్రలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..

ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస రెడ్డి తన కార్యకర్తలతో కలిసి తన హత్యకు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన‌ ఆరోపణలు చేశారు. ఎన్ఆర్ఐ నంటూ, ఆదిలాబాద్‌ను ఉద్దరించేందుకు వచ్చానంటూ చెప్పుకుంటున్న కంది శ్రీనివాస్ తనపై తన కుటుంబంపై సంస్కారం, పద్ధతి లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: నన్ను చంపాలని‌ కుట్రలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..
MLA Jogu Ramanna(File Photo)
Follow us
Naresh Gollana

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 29, 2023 | 5:48 PM

ఆదిలాబాద్, జులై 29: ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస రెడ్డి తన కార్యకర్తలతో కలిసి తన హత్యకు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన‌ ఆరోపణలు చేశారు. ఎన్ఆర్ఐ నంటూ, ఆదిలాబాద్‌ను ఉద్దరించేందుకు వచ్చానంటూ చెప్పుకుంటున్న కంది శ్రీనివాస్ తనపై తన కుటుంబంపై సంస్కారం, పద్ధతి లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చంపించేందుకు తన చెంచాగాళ్లతో కుట్రలు పన్నుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు‌ ఎమ్మెల్యే జోగు రామన్న. తన ఆస్తులు, కుటుంబీకులపై మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపిన ఎమ్మెల్యే.. తనపై చేసిన అవినీతి ఆరోపణలను కూడా తోసిపుచ్చారు.

ఇదే అంశంపై శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయ‌ సన్యాసం తీసుకుంటానని‌ సవాల్ విసిరారు. ఉన్నత చదువులు చదివిన వ్యక్తికి ఉండాల్సిన సంస్కారం, మర్యాద లేకుండా ఎన్ఆర్ఐ కంది మాట్లాడుతున్నారని.. కేవలం జోగురామన్న ను వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మాట్లాడితే పెద్ద నాయకుడివి అవుతా, టికెట్ వస్తుంది అని ఉద్దేశ్యంతో ఊహించుకుంటే నష్టం తప్ప నీకు లాభం ఉండదని‌ హితవు పలికారు‌. కంది అవినీతి ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని… కంది శ్రీనివాస్ రెడ్డి పై పరువు నష్టం దావా వేస్తానని తేల్చి చెప్పారు‌. టికెట్ రాకపోతే అమెరికా పారిపోయే నీకా ఆదిలాబాద్ ప్రజల ఆశీస్సులు దక్కేది అని హెద్దేవా చేశారు ఎమ్మెల్యే జోగు రామన్న.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..