Road Accident: హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. బైక్ యాక్సిడెంట్‌లో అన్నాదమ్ముల దుర్మరణం
హనుమకొండ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. హసన్ పర్తి మండలం అనంతసాగర్ వద్ద బైక్ డీకొన్న ఘటనలో ఇద్దరు అన్నతమ్ముళ్లు మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన గుర్తు తెలియని వాహనం బైక్ ను డీకొట్టింది. మృతులు హుజరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన ..
రెక్కలు.. ముక్కలు చేసుకుని కొడుకులను ప్రయోజకులను చేసిన ఆతల్లిదండ్రులకు నిరాశే మిగలింది. బైక్ యాక్సిడెంట్.. ఆ కుటుంబం పాలిట శాపమైంది. హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం కందుగుల గ్రామంలో విషాదాన్ని నింపింది. హనుమకొండ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. హసన్ పర్తి మండలం అనంతసాగర్ వద్ద బైక్ డీకొన్న ఘటనలో ఇద్దరు అన్నతమ్ముళ్లు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన గుర్తు తెలియని వాహనం బైక్ ను డీకొట్టింది. మృతులు హుజరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణ గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన మృతుల కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో ఒకరైన అన్న .. ఇప్పలపల్లి శివరామకృష్ణకు రైల్వేలో టీసీగా జాబ్ వచ్చింది. సికింద్రాబాద్‌లోని మౌలాలిలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తమ్ముడు ఇప్పలపల్లి హరికృష్ణ బీసీఎస్ పూర్తి చేసి ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ గా పనిచేస్తున్నాడు. శివరామకృష్ణకు రైల్వే టీసీతో పాటు ఫోస్టల్ లో మరో జాబ్ రావడంతో ఏ ఉద్యోగం చేయాలనే విషయంపై చర్చించుకునేందుకు ఇంటికి వచ్చారు.. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఇద్దరు అన్నదమ్ములు తిరిగి డ్యూటీకి వెళ్లే క్రమంలో అనంతసాగర్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం మరోదాన్ని ఓవర్‌టేక్ చేస్తుండగా.. బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అన్నదమ్ముళ్లు శివరామకృష్ణ, హరికృష్ణ ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. తలతో పాటు శరీర భాగాలపై తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. అన్నదమ్ములు మృతి చెందడం తో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరు గా విలపిస్తున్నారు.
మృతుల తల్లిదండ్రులు మనోహర్, శారదలు రెక్కలు.. ముక్కలు చేసుకుని ఇద్దరు కొడుకులను ఉన్నత చదువులు చదివించారు. తల్లిదండ్రులు పడిన కష్టానికి గుర్తుగా ఇద్దరు అన్నతమ్ముళ్లు మంచి ఉద్యోగాలు సాధించి కన్నవారి కళ్లలో ఆనందాన్ని నింపారు. ఇంతలోనే వారి పాలిట విధి వక్రీకరించింది.. మృత్యుఒడికి చేర్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..