క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. అర్ధరాత్రి దాటితే జనం వణుకు.. అనుమానాస్పద స్థితిలో యువకుడు అదృశ్యం.!

వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడుల కలకలం రేపింది. గ్రామానికి చెందిన చీమల సతీష్‌ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో..

  • Publish Date - 6:26 pm, Thu, 10 June 21
క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. అర్ధరాత్రి దాటితే జనం వణుకు.. అనుమానాస్పద స్థితిలో యువకుడు అదృశ్యం.!
Black Magic

వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడుల కలకలం రేపింది. గ్రామానికి చెందిన చీమల సతీష్‌ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో కనిపించకుండాపోయాడు. ఎప్పటిలాగే ఆరుబయట పడుకున్న సతీష్ ఉదయం లేచి చూసేసరికి కనపడలేదు. దీంతో కంగారుపడిన సతీష్‌ కుటుంబీకులు, స్థానికులు అతని కోసం అంతా వెతికారు.

అయితే, అతను పడుకున్న మంచం ప్రక్కన చేతబడి చేసి ఉండడం చూసి ఒక్కసారిగా గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంచం పక్కనే మనిషి బొమ్మ , ముగ్గు గీసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గు వేసి చేతబడి చేసి ఉంది. అతడు పడుకున్న మంచంలో అతని సెల్ ఫోన్ అలానే ఉంది. కానీ, సతీష్‌ బైక్‌ కూడా కనిపించకుండాపోయింది.

అదృశ్యమైన యువకుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలిద్దరూ చిన్నవారు. చేతబడి చేసి సతీష్‌ని ఏం చేసి ఉంటారో అని భార్య, తల్లి, బంధువులు రోధిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడని, ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించలేదని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read:

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!

 మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ రోగాలు రావొచ్చు!

Black Magic 2