Telangana: బండి సంజయ్ VS కవిత.. సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బండి సంజయ్ ట్విట్టర్‌లో విమర్శించారు. దీనిపై స్పందించిన కవిత ఆయనకు కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బండి సంజయ్ ట్విట్టర్‌లో విమర్శించారు. దీనిపై స్పందించిన కవిత ఆయనకు కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ ట్వీట్ చేస్తూ.. గవర్నర్‌కు గౌరవం దక్కదు. ఆడబిడ్డలకు లేదు అండ. గిరిజన మహిళలపై పోలీస్ గిరీ, బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం. ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం. అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం’ అంటూ రాసుకొచ్చారు.
దీనికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం. ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన భాజపా ఎంపీపై చర్యలు ఉండవు. దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం. నినాదాలకే పరిమితమైన భేటీ బచావో భేటీ పడావో. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి. మహిళా విద్య, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం. ఆడ బిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం. ఆడబిడ్డ తలచుకుంది ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది’’ అని ట్వీట్ చేశారు.




పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం
దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు
దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం… https://t.co/V05XeA3vR5
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 13, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.