Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఢిల్లీ పెద్దల నజర్‌.. కారు స్పీడ్‌కు బ్రేక్‌ వేసేందుకు యాక్షన్‌ప్లాన్‌..

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసింది. బీజేపీ సీనియర్‌ నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. మిషన్‌ 90 టార్గెట్‌గా కమలంపార్టీ వ్యూహాలకు పదునుపెట్టి.. కారు స్పీడ్‌కు బ్రేక్‌ వేసేందుకు యాక్షన్‌ప్లాన్‌ రచిస్తోంది. తెలంగాణ కమలం పార్టీ శక్తిని కూడగట్టుకునే పనిలో పడింది.

Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఢిల్లీ పెద్దల నజర్‌.. కారు స్పీడ్‌కు బ్రేక్‌ వేసేందుకు యాక్షన్‌ప్లాన్‌..
Telangana Bjp
Follow us

|

Updated on: May 25, 2023 | 7:11 AM

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసింది. బీజేపీ సీనియర్‌ నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. మిషన్‌ 90 టార్గెట్‌గా కమలంపార్టీ వ్యూహాలకు పదునుపెట్టి.. కారు స్పీడ్‌కు బ్రేక్‌ వేసేందుకు యాక్షన్‌ప్లాన్‌ రచిస్తోంది. తెలంగాణ కమలం పార్టీ శక్తిని కూడగట్టుకునే పనిలో పడింది. కర్ణాటక ఎఫెక్ట్ తెలంగాణపై పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ప్రధానంగా రాష్ట్రనేతల మధ్య సమన్వయమే బీజేపీ పెద్దలకు తలకుమించిన భారంగా మారింది. రాష్ట్ర నేతలు కలిసివెళ్లేందుకు పార్టీ అగ్రనేత అమిత్ షా పలు సూచనలు చేసినా అమలు చేయడం లేదు. రాష్ట్ర కీలక నేతలు వారానికోసారి ఓ నేత ఇంట్లో కూర్చుని అల్పాహారం, భోజనం పెట్టుకొని ఒపెన్‌గా డిస్కషన్ చేసుకోవాలని పార్టీ హైకమాండ్ సూచించినా అది కార్యరూపం దాల్చడం లేదు. వీటితో పాటు రాష్ట్ర నాయకత్వం పనివిభజన చేసుకోకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. పార్టీ నేతల మధ్య సమన్వయం, పనివిభజన చేసుకుంటే మిషన్ 90 లక్ష్యం సాధించవచ్చని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. వీటిపైనే బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి సీనియర్‌ నేతలకు కొత్త బాధ్యతలు త్వరలోనే అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈటల రాజేందర్‌కు రాష్ట్ర పార్టీ ప్రచారకమిటీ పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. ఏ గ్రూపులో లేకుండా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేవలను పార్టీకి మరోరకంగా ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు నేతలు ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో భేటీ అయ్యి రాష్ట్ర పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు.

మరోవైపు, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శక్తి మేరకు పనిచేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. పార్టి శక్తిని విస్తరించడానికి కొత్తవారిని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు ఈటల రాజేందర్‌.

ఇవి కూడా చదవండి

మొత్తానికి కాషాయ ఫ్లేవర్ పైనే డిపెండ్ కాకుండా.. కొంత లోకల్ ఫ్లేవర్‌తో ఎన్నికల్లో పోరాడితే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాలో తెలంగాణ కమలనేతలు ఉన్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..