Etela Rajender: బీజేపీపై ఉన్న కోపాన్ని రైతులపై చూపించడం సరికాదు.. కేసీఆర్‌పై ఈటల రాజేందర్ సీరియస్ కామెంట్స్..
భారతీయ జనతా పార్టీపై(BJP) ఉన్న కోపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రైతాంగం మీద చూపిస్తున్నారని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) మండిపడ్డారు.
భారతీయ జనతా పార్టీపై(BJP) ఉన్న కోపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రైతాంగం మీద చూపిస్తున్నారని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. ధాన్యం సేకరణ కొత్తగా వచ్చింది కాదని.. దశాబ్దాలుగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీలా పనిచేస్తుందని విమర్శించారు. ధాన్యం సేకరణకు డబ్బులన్ని కేంద్రమే ఇస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీగా మాత్రమే పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం రంగంలో దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఫుడ్ కార్పొరేషన్ రెండు విధానాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, డీసీపీ పద్ధతిని తెలంగాణ రాష్ట్రం ఎంచుకుని ధాన్యాన్ని ఇస్తుందని, ముందు చూపు లేక చిన్న చూపు చూడటం వల్లే సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు.
ధాన్యం పండించి పార్టీ కార్యాలయాలు, ఇళ్ల ముందు పోస్తామని సీఎం కేసీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరి వేయొద్దంటే రైతుల పరిస్థితేంటని ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం తెలంగాణ బీజేపీ శాఖ కృషి చేస్తుందన్నారు.
వరి వేయవద్దంటే.. రైతుల పరిస్థితి ఏమి కావాలని ప్రశ్నించారు. ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
ఇవి కూడా చదవండి: Egg Storing Hacks: వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..? ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో తెలుసా..
Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..