AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Group War: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో అందరిదీ అదే రచ్చ.. తీరుమార్చుకోని నేతల తీరు..

Congress Group War: తెలంగాణ కాంగ్రెస్ కహానీ .. మూడు కుమ్ములాటలు, ఆరు కొట్లాటలు అన్నట్టుగా తయారైంది. రాష్ట్రంలోనే కాదు.. జిల్లా కేంద్రాల్లోనూ వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా రెండు జిల్లాల పార్టీ అధ్యక్షుల మధ్య మొదలైన జగడం..

Congress Group War: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో అందరిదీ అదే రచ్చ.. తీరుమార్చుకోని నేతల తీరు..
Congress Leaders Group War
Sanjay Kasula
|

Updated on: Mar 23, 2022 | 8:01 PM

Share

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కహానీ .. మూడు కుమ్ములాటలు, ఆరు కొట్లాటలు అన్నట్టుగా తయారైంది. రాష్ట్రంలోనే కాదు.. జిల్లా కేంద్రాల్లోనూ వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా రెండు జిల్లాల పార్టీ అధ్యక్షుల మధ్య మొదలైన జగడం… దుమారం రేపుతోంది. లిమిట్‌ దాటొద్దంటూ.. వార్నింగులు ఇచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ జిల్లాలేవి? ఏమిటా గొడవ? జనగామ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు జంగారాఘవరెడ్డిపై.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జంగా నీ జిల్లా ఏది..? ఏ నియోజక వర్గానికి నువ్వు ఇంచార్జ్..? మరి, ఏ జిల్లాలో నీ నీచరాజకీయాలు చేస్తున్నావ్‌. అంటూ.. ఊగిపోయారు రాజేందర్‌ రెడ్డి. అంతేకాదు, ఈనెల 31 డెడ్‌లైన్‌… ఆ లోపు ఆయనపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోతే తమదారి తాము చూసుకుంటామని అల్టిమేటం ఇచ్చారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి ఫైట్ తరహాలోనే… జిల్లా కేంద్రాలలో కూడా నేతల గ్రూప్ వార్ నడుస్తోందనేందుకు ఇదో చిన్న ఉదాహరణ. నేతల మధ్య టిక్కెట్ల పోరు క్యాడర్ ను పరేషాన్‌లో పేడస్తోంది. పార్టీ నాయకత్వ అసమర్థతతో ద్వితీయ శ్రేణి కార్యకర్తలు గందరగోళం చిక్కుకుంటున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్ కేడర్‌ది అదే పరిస్థితి.

ఇప్పుడు నాయిని రాజేందర్ రెడ్డి.. జనగామ డీసీసీ ప్రెసిడెంట్‌ జంగా రాఘవరెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైరవడం సంచలనంగా మారింది. ఇలాంటి చీడ పురుగుల వల్లే జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట మూట కట్టుకుంటోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజేందర్‌ రెడ్డి. ఇలాంటి కోవర్టులు, నీచ రాజకీయాలు చేసేవారిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

2018 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీచేసి ఓడిన జంగా రాఘవరెడ్డి జనగామలో పట్టు కోసం పాకులాడి… మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్యయ్యకే ఎసరు పెట్టారని ఆరోపించారు రాజేందర్‌ రెడ్డి. జనగామ లో జంగాను పార్టీ నేతలు అసహ్యించుకోవడంతో ఇప్పుడు హనుమకొండపై కన్నేసి కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఏజిల్లాకు చెందిన వ్యక్తి.. ఏ జిల్లాకు వచ్చి నీచ రాజకీయాలు చేస్తున్నాడో ఆలోచించాలంటూ.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాజేందర్ రెడ్డి ఆగ్రహానికి అసలు కారణం… టిక్కెట్ల రేసు రాజకీయాలేనని తెలుస్తోంది. తన జిల్లాను వదిలేసి జంగా రాఘవరెడ్డి.. ఎక్కువగా హనుమకొండలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయ రగడకు కారణమైంది. స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి ఇటీవల కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. అంతేకాదు, ఆయన హన్మ కొండ నుండి పోటీ చేయాలని తహతహలాడుతున్నాడట. అనుచరులతోనూ ఇదే విషయంపై సంప్రదింపులు జరుపుతున్నా రట. కొన్ని వర్గాల ప్రజలతో రహస్య సమావేశాలు నిర్వహించారట రాఘవరెడ్డి. దీంతో, రాజేందర్‌ రెడ్డికి చిర్రెత్తుకొచ్చిందట. పాలకుర్తి, జనగామ, హన్మకొండ నియోజకవర్గాలను జంగా రాఘవరెడ్డి డిస్టర్బ్ చేస్తున్నాడని ఆరోపించారు. హనుమకొండ నీ అయ్య జాగీరా అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు.

జంగా రాఘవరెడ్డి కోవర్టు రాజకీయాలపై ఇప్పటికే పది సార్లు పార్టీ నాయకత్వానికి పిర్యాదు చేశానంటున్న రాజేందర్ రెడ్డి… ఈనెల 31 వరకు డెడ్ లైన్ పెట్టారు. ఆలోపు జంగాపై చర్యలు తీసుకోకపోతే తమదారి తమదేనని తేల్చేశారు. రాజేందర్‌ రెడ్డి వ్యాఖ్యలపై జంగా రాఘవరెడ్డి ఇంకా నోరు మెదపలేదు. తాను, ఏ కార్యక్రమం చేసినా పార్టీ కోసమేనని చెబుతున్నారట. మరి, ఈ రచ్చకు కాంగ్రెస్‌ అధిష్టానం ఎలా పుల్‌స్టాప్‌ పెడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: Egg Storing Hacks: వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..? ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో తెలుసా..

Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..