AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ఎస్ఐ బైక్ లాక్కుని, కొట్టారంటూ యువకుడి ఆత్మహత్య.. నిర్మల్ జిల్లాలో టెన్షన్!

నిర్మల్‌ జిల్లా గోండుగూడాలో టెన్షన్‌ టెన్షన్‌ నెలకొంది. నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Crime News: ఎస్ఐ బైక్ లాక్కుని, కొట్టారంటూ యువకుడి ఆత్మహత్య.. నిర్మల్ జిల్లాలో టెన్షన్!
Nirmal Suicide
Balaraju Goud
|

Updated on: Mar 24, 2022 | 12:30 PM

Share

Young man commits suicide: నిర్మల్‌ జిల్లా(Nirmal District) గోండుగూడాలో టెన్షన్‌ టెన్షన్‌ నెలకొంది. నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దస్తూరాబాద్‌ సబ్ ఇన్స్‌పెక్టర్(Dusthurabad SI)  కొట్టిందన్న మనస్తాపంతోనే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగరాజు డెడ్‌బాడీతో పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు ఆదివాసీలు. దీంతో గోండుగూడ గ్రామస్తులకు-పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ నెల 14న జరుపుకొని తిరిగొస్తుండగా..డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు నాగరాజు. దస్తూరాబాద్‌ ఎస్సై నాగరాజును కొట్టడంతో పాటు బైక్‌ కీస్‌ కూడా తీసుకుందని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. నిశ్చితార్థం అనంతరం ఇంటికొచ్చిన నాగరాజు అదే రోజు రాత్రి పురుగుల మందు తాగాడు. అతన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే జన్నారం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, ఎస్‌ఐ కొట్టడం వల్లే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు ఆదివాసీలు.

Read Also… Viral Video : పులి నుంచి ఫ్రెండ్‌ను కాపాడుదాం అనుకుంది కానీ సీన్ రివర్స్ అయ్యింది..