AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : పులి నుంచి ఫ్రెండ్‌ను కాపాడుదాం అనుకుంది కానీ సీన్ రివర్స్ అయ్యింది..

వేటాడటం పులులు,  సింహాల సహజ లక్షణం. వాటి దాడి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. మాటువేసి ఒక్కసారి దాడి చేశాయంటే ఎంతటి జతువైనా నెలకులాలిసిందే.

Viral Video : పులి నుంచి ఫ్రెండ్‌ను కాపాడుదాం అనుకుంది కానీ సీన్ రివర్స్ అయ్యింది..
Tiger
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2022 | 12:22 PM

Share

Viral Video : వేటాడటం పులులు, సింహాల సహజ లక్షణం. వాటి దాడి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. మాటు వేసి ఒక్కసారి దాడి చేశాయంటే ఎంతటి జతువైనా నెలకులాలిసిందే. ఈ మృగాలకు చిక్కిన జతువులు తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంటాయి. కొన్ని సార్లు తమ తోటి జంతువులు వాటికి సాయం చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ పులి కాపు కాసి మరి ఓ అడవి దున్న పై దాడి చేసింది. అయితే ఈ దాడి నుంచి ఆ అడవి దున్నను కాపాడేందుకు మరో అడవి దున్న ప్రయత్నించింది కానీ సీన్ రివర్స్ అయ్యింది.

ఈ వీడియోలో ఓ అడవి దున్న పై ఓ పులి దాడి చేసింది. అయితే దాని నుంచి తప్పించుకోవడానికి ఆ అడవి దున్న చాలా ప్రయత్నించింది. ఇంతలో అది గమనించిన మరో అడవి దున్న అక్కడికి వచ్చింది. దాని కొమ్ములతో పులి పై దాడి చేసి తోటి దున్నను కాపాడాలనుకుంది. కానీ తల వంచి కొమ్ములతో కుమ్ముదాము అనుకునేలోగా పులి కాస్త పక్కకు జరిగింది దాంతో అక్కడ ఉన్న దున్నను తన కొమ్ములతో పొడిచింది. దాంతో దాడికి గురైన దున్నకు గాయం కావడంతో  తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. దాంతో పులి ఆ దున్నను వదలకుండా గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొన్ని సార్లు సీన్ ఇలా రివర్స్ అవుతూ ఉంటాయి అని నెటిజన్లు ఈ వీడియో పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదు. ఈ వీడియో యానిమల్స్ ఎనర్జీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పటికే చాలా మంది ఈ వీడియోను వీక్షించారు. కొందరు ఇదో పెద్ద స్కామ్ అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: గంగూలీనీ వదలని పుష్ప ఫీవర్.. పుష్పరాజ్‌గా మారిన దాదా.. వైరల్‌ అవుతోన్న వీడియో.

Tax On Petrol: రూ.100 పెట్రోల్ లో టాక్స్ ఎంతో తెలుసా..? తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పన్ను వసూలు..

Multibagger Returns: ఏడాదిలో పెట్టుబడిని రెండింతలు చేసిన రియల్ ఎస్టేట్ మల్టీబ్యాగర్ స్టాక్..