AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గంగూలీనీ వదలని పుష్ప ఫీవర్.. పుష్పరాజ్‌గా మారిన దాదా.. వైరల్‌ అవుతోన్న వీడియో.

Viral Video: పుష్ప (Pushpa) మేనియా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శతకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా టాలీవుడ్‌లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో..

Viral Video: గంగూలీనీ వదలని పుష్ప ఫీవర్.. పుష్పరాజ్‌గా మారిన దాదా.. వైరల్‌ అవుతోన్న వీడియో.
Narender Vaitla
|

Updated on: Mar 24, 2022 | 9:15 AM

Share

Viral Video: పుష్ప (Pushpa) మేనియా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శతకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా టాలీవుడ్‌లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో బాలీవుడ్‌లో అంతకుమించి అన్నట్లు దూసుకుపోయింది. అత్యధిక కలెక్షన్లతో రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. పుష్పరాజ్‌ మేనరిజంతో బన్నీ పలకించిన హావభాబాలకు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. నార్త్‌ ఆడియన్స్‌కు కూడా బన్నీకి ఫాలోవర్లుగా మారిపోయారు.

దీంతో సోషల్‌ మీడియాలో పుష్పకు సంబంధించిన వీడియోలు ప్రతీ రోజూ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. సామాన్యుల నుంచి మొదలు సినీ, క్రీడా సెలబ్రిటీల వరకు పుష్ప సినిమా పాటలు, డైలాగ్స్‌కు రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు కాస్త వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు పుష్ప ఫీవర్‌ అంటుకోగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా వచ్చి చేరారు. పుష్ప సినిమాలోని పాటలకు స్పెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నాడు. జీ బంగ్లా ఛానల్‌లో ప్రసారమయ్యే ఓ రియాలిటీ షోలో పాల్గొన్న గంగూలీ పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు కాలుకదిపి రచ్చ చేశాడు. అంతటితో ఆగకుండా పుష్ప సిగ్నేచర్‌.. ‘తగ్గేదేలే’ అంటూ అభిమానుల్లో జోష్‌ పెంచేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప సినిమాకు ప్రస్తుతం సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చి ఇప్పటికి మూడు నెలలు గడుస్తోన్నా పుష్ప క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. పుష్ప తొలి పార్ట్‌ ది రైజ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, పుష్ప ది రూల్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకొని సుకుమార్‌ సినిమా చిత్రీకరణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read: Summer Tips: వేసవిలో ఎసిడిటీ ఇబ్బంది పెడుతోందా?.. అయితే ఈ ఆహార పదార్థాలు తప్పక తీసుకోవాల్సిందే..

TS Govt Jobs: టీచర్‌ పోస్టుల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. టెట్‌ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే..

Pooja Hegde: అప్పుడే ఆ విషయం అర్థమైంది.. వేదాంతం వల్లించిన బుట్ట బొమ్మ..

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..