Crime: ముగ్గురు భార్యలను కాదని మరోసారి.. కోపంలో రెండో భార్య ఏం చేసిందంటే.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
కర్ణాటకలోని బెళగావిలో(Belgaum) సంచలనం రేకెత్తించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్ హత్య కేసును పోలీసులు(Police Chased) ఛేదించారు. ఆయన రెండో భార్య, వ్యాపారంలోని ఇద్దరు భాగస్వాములు..
కర్ణాటకలోని బెళగావిలో(Belgaum) సంచలనం రేకెత్తించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్ హత్య కేసును పోలీసులు(Police Chased) ఛేదించారు. ఆయన రెండో భార్య, వ్యాపారంలోని ఇద్దరు భాగస్వాములు ఈ హత్యకు(Murder) ప్రణాళిక రూపొందించారని పోలీసులు గుర్తించారు. హత్య చేసేందుకు రూ.10 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నట్లు చెప్పారు. హత్య జరిగిన అనంతరం హంతకులకు రూ.పది లక్షలు చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో దొడ్డబొమ్మన్నవర్ రెండో భార్య కిరణ, భాగస్థులు ధర్మేంద్ర, శశికాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 15న దొడ్డబొమ్మన్నవర్ హత్యకు గురయ్యారు. బైక్ పై వచ్చిన దుండగులు ఆయన ముఖంపై కారంపొడి చల్లి హత్య చేశారు. రోడ్డు పక్కన పడి ఉన్న శవాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోనికి వచ్చాయి.
రాజు దొడ్డబొమ్మన్నవర్‌కు ముగ్గురు భార్యలు. వారికి వేర్వేరుగా ఇళ్లు నిర్మించారు. డబ్బు విషయంలో రెండో భార్యతో గొడవలు తలెత్తాయి. ఇదే అదనుగా వ్యాపారంలో భాగస్థులు ఆమెతో చేతులు కలిపారు. హంతకులతో మాట్లాడి రూ.10 లక్షల సుపారీ ఇచ్చారు. పోలీసులు అనుమానంతో రాజు రెండో భార్య కిరణ కాల్‌డేటాను పరిశీలించి విచారించగా ఈ విషయం బహిర్గతమైంది. సంజయ్ రాజపుత్, అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.
Also Read
Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా.. వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..