Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా.. వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..
వచ్చే వారం మీరు ఏమైనా బ్యాంకు(Bank) పనులు పెట్టుకున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. ఎందుకంటే వచ్చే 6 రోజుల్లో4 రోజులు బ్యాంకులు పనిచేయవు...
వచ్చే వారం మీరు ఏమైనా బ్యాంకు(Bank) పనులు పెట్టుకున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. ఎందుకంటే వచ్చే 6 రోజుల్లో4 రోజులు బ్యాంకులు పనిచేయవు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 మధ్య బ్యాంకులు నాలుగు రోజులే పని చేస్తాయి. ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు మార్చి 28-29 తేదీలలో రెండు రోజుల సమ్మె(Strike)ను ప్రకటించాయి. సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ సమ్మె జరుగుతోంది. ఎస్‌బీఐ తమ శాఖలు, కార్యాలయాల్లో పనులను సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తామని, అయితే సమ్మె కారణంగా ఇక్కడి పనులపై కొంత మేర ప్రభావం పడవచ్చని పేర్కొంది.
బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లలో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021ని వెనక్కి తీసుకోవడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరణను ఆపడం, మొండి బకాయిల్ని రికవరీ చేయడం, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం, కస్టమర్లపై భారీ సర్వీస్ ఛార్జీలు తొలగించడం, ఐదు రోజుల పనిదినాలు, చైల్డ్ కేర్ లీవ్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను తొలగించడం, పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయడం, డియర్‌నెస్ అలవెన్స్‌లో క్రమరాహిత్యాన్ని తొలగించడం లాంటి ఉన్నాయి. బ్యాంకులు సమ్మెలో ఉన్నప్పుడు ఖాతాదారులకు బ్యాంకు బ్రాంచ్‌లో లభించే సేవలకు అంతరాయం కలుగుతుంది. అయితే డిజిటల్ పద్ధతిలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాకింగ్, యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు.
Read Also.. Toothpaste: ఆ వ్యాపార ప్రకటనలపై నిషేధం.. తప్పుదారి పట్టించేలా ఉన్నాయంటూ జరిమానా