Goa Shipyard Recruitment: గోవా షిప్‌యార్డ్‌లో కన్సల్టెంట్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Goa Shipyard Recruitment: గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కన్సల్టెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ మార్చి చివరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
Goa Shipyard Recruitment: గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కన్సల్టెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ మార్చి చివరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్–నేవిగేషన్–కంట్రోల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 63 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది చీఫ్ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్–ఏ),డా.బీ.ఆర్.అంబేడ్కర్ భవన్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, వాస్కోడిగామా, గోవా–403802 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను తొలుత పని అనుభవం, అకడమిక్ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Nikhil Siddharth: మాస్ మహారాజాతో పోటీపడుతున్న కుర్ర హీరో.. ఒకే రోజు రెండు సినిమాలు
Parenting Tips: మీరు వర్కింగ్ పేరెంట్సా?.. అయితే పిల్లల పెంపకంలో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?..