AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు..

Telangana Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్..
Telangana Jobs
Sanjay Kasula
|

Updated on: Mar 23, 2022 | 9:15 PM

Share

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. మొత్తం 80,039 పోస్టులకు గాను.. తొలి విడుతగా 30,453 పోస్టుల భర్తీకి ఇవాళ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. గ్రూప్‌-1, హోంశాఖ, జైళ్లు, రవాణాశాఖలు, వైద్య, ఆరోగ్యశాల్లోని పోస్టులతో పాటు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు సైతం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సంబంధిత శాఖల్లో భర్తీ ప్రక్రియను నియాకమక సంస్థలు చేపట్టనున్నాయి. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి, మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేయనున్నది.

ఇటీవల శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసందే. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ శాసన సభలో ఆదేశాలు జారీ చేసిన సంగతి  తెలిసిందే. అయితే.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు.

ఇవి కూడా చదవండి: Egg Storing Hacks: వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..? ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో తెలుసా..

Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..