AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: యాసంగిలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ లేఖ

ధాన్యం సేక‌ర‌ణ‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు(CM KCR) లేఖ రాశారు. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

CM KCR: యాసంగిలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ లేఖ
Cm Kcr
Sanjay Kasula
|

Updated on: Mar 23, 2022 | 9:33 PM

Share

ధాన్యం సేక‌ర‌ణ‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు(CM KCR) లేఖ రాశారు. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆ లేఖ‌లో పేర్కొన్నారు. పంజాబ్, హ‌ర్యానాలో మాదిరిగానే తెలంగాణ‌లో కూడా ధాన్యాన్ని సేక‌రించాల‌ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని అమ‌లు చేసే బాధ్య‌త కేంద్రానిదే అని సీఎం కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు. ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం ప్ర‌కారం ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌.. వాటి భ‌ద్ర‌త కూడా కేంద్రానిదే అని సీఎం కేసీఆర్ కేంద్రానికి పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, వ్య‌వ‌సాయ నిపుణుల‌తో ఓ స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ ఈ లేఖ‌లో సూచించారు. రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని సేక‌రించ‌క‌పోతే.. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు ఏం అర్థ‌ముంటుంద‌ని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

ఆహార భ‌ద్ర‌తా ల‌క్ష్యానికి కూడా తూట్లు పొడిచిన‌ట్లే అవుతుంద‌ని సీఎం తేల్చి చెప్పారు. దేశ మంతా ఒకే ర‌క‌మైన ధాన్య సేక‌ర‌ణ విధానం ఉండాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వం పండిన ధాన్యాన్ని గ‌న‌క పూర్తిగా సేక‌రించ‌క‌పోతే సాగు రంగంపై దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంటుంద‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. అయితే.. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌ల వ‌ల్ల రాష్ట్రంలో ధాన్యం దిగుబ‌డి బాగా పెరిగింద‌ని, వ్య‌వ‌సాయం సుస్థిర‌ప‌డింద‌న్నారు.

పంట‌ల వైవిధ్య‌త కోస‌మే త‌మ ప్ర‌భుత్వం ఇత‌ర పంట‌ల‌ను కూడా ప్రోత్స‌హిస్తోంద‌ని కేసీఆర్ కేంద్రానికి క్లారిటీ ఇచ్చారు. ర‌బీ సీజ‌న్‌లో 52 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పంట‌ను సాగు చేయించామ‌ని, ఎలాంటి ఆంక్ష‌లు లేకుండా వ‌రిని కొనుగోలు చేయాల‌ని సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోడీని కోరారు.

ఇవి కూడా చదవండి: Telangana Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్..

 Egg Storing Hacks: వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..? ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో తెలుసా..

Follow Us
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..