AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhavi Latha: మరో వివాదంలో మాధవీలత.. ఎయిర్‌పోర్టులో దుర్గా సూక్తం.. ఏం జరిగిందంటే..?

బీజేపీ నేత మాధవీలత మరోసారి వార్తల్లోకెక్కారు. నిన్న ఢిల్లీ విమానాశ్రయంలోని ప్రేయర్ రూమ్ లో మాధవీలత దుర్గా సూక్తం పఠిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మాధవీలత ప్రేయర్ చేస్తున్నప్పుడు అదే రూమ్ లో ముస్లిం మహిళలు ఉండడంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది.

Madhavi Latha: మరో వివాదంలో మాధవీలత.. ఎయిర్‌పోర్టులో దుర్గా సూక్తం.. ఏం జరిగిందంటే..?
Madhavi Latha
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Mar 25, 2026 | 10:04 PM

Share

బీజేపీ నేత మాధవీలత మరోసారి వివాదంలో చిక్కుకన్నారు. నిన్న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని ప్రేయర్ రూమ్‌లో మాధవీలత దుర్గా సూక్తం పఠిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మాధవీలత ప్రేయర్ చేస్తున్నప్పుడు అదే రూమ్ లో ముస్లిం మహిళలు ఉండడంతో ఈ ఘటన కలకలం రేపుతోంది. మాధవీలత కావాలనే రెచ్చగొట్టేలా ప్రవర్తించారని.. అందుకే బిగ్గరగా సూక్తం చదువుతూ వీడియో కూడా రికార్డు చేయించుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా MBT స్పందించింది. బీజేపీ నాయకురాలు కొంపెళ్ల మాధవీలతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఢిల్లీ విమానాశ్రయంలో బీజేపీ నాయకురాలు కొంపెళ్ల మాధవీలత చేసిన అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే చర్యను మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ తీవ్రంగా ఖండించారు. హిజాబ్/బురఖా ధరించిన ముస్లిం మహిళల సమక్షంలో ప్రార్థనా గదిలో సూక్తం పఠించడం, వారి అనుమతి లేకుండా వీడియో తీయడం మత సామరస్యాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రార్థనా స్థలాలు శాంతియుత ఆరాధన, పరస్పర గౌరవం కోసం ఉద్దేశించినవే తప్ప, అసౌకర్యం కలిగించడానికి లేదా ఏ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కాదని అమ్జెద్ ఉల్లా ఖాన్ అన్నారు. ఇలాంటి చర్యలు మతపరమైన భావాలను రెచ్చగొట్టి, సామరస్యాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయని, ప్రజాస్వామ్య, లౌకిక దేశంలో వీటిని సహించకూడదని తెలిపారు. ప్రస్తుతం ఈ వివాదం ముదురుతోంది. ప్రార్థనా స్థలాలలో ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించే చర్యలు ముమ్మాటికీ తప్పే అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇందుకు సంబంధించి అధికారులు కింది విధంగా చర్యలు తీసుకోవాలని MBT అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ వివరించారు. అన్ని మతాల పట్ల గౌరవం, మహిళల గౌరవ పరిరక్షణను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని నొక్కి చెప్పారు. మతాన్ని ఎన్నడూ రెచ్చగొట్టే సాధనంగా ఉపయోగించకూడదని.. భిన్నత్వంలో ఏకత్వంలోనే భారతదేశ బలం ఉంటుందని అన్నారు. అయితే.. తాజా వివాదంపై మాధవీలత మరోసారి ట్వీట్ చేశారు. సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయ సమయాలలో దైవాన్ని స్మరించాలని హిందూ ధర్మం బోధిస్తుందని మాధవీలత తెలిపారు. భక్తి అనేది క్షణికమైన అంశం కాదు.. అది ఒక జీవన విధానమంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. మాధవీలత పోస్టుకు కొందరు వ్యతిరేకంగా వాదిస్తుంటే.. మరికొందరు అందులో తప్పేమీ లేదని ఆమె చర్యలను సమర్థిస్తున్నారు. మరి చూడాలి.. ఈ వివాదం మరెన్ని మలుపులు తీసుకుంటుందో..!

Follow Us